NTV Telugu Site icon

India – US Relations: అమెరికా- భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి..

Indvsus

Indvsus

India – US Relations: భారత్- అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతమైన మార్గాల్లో ముందుకు వెళ్తుందని ఇండో పసఫిక్ భద్రతా వ్యవహారాల కార్యదర్శి ఎలీ రాట్నర్ తెలిపారు. అమెరికా- భారత్‌ల మధ్య మంచి రక్షణ సంబంధాలు ఉన్నాయి.. ఇది రక్షణ పారిశ్రామిక సహకారంతో పాటు కార్యాచరణ సహకారానికి సంబంధించినదని చెప్పుకొచ్చారు. ఇటీవల 31 ఎంక్యూ-9బీ ప్రీడేటర్ డ్రోన్లను తక్కువ మొత్తంలో అందించడానికి అమెరికా ముందుకొచ్చిందన్నారు. దీంతో పాటు ఈ ఏడాది ఇరు దేశాల మధ్య పలు రక్షణ పరికరాల సరఫరాకు కీలక ఒప్పందాలు జరిగాయని ఎలీ రాట్నర్ చెప్పుకొచ్చారు.

Read Also: US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..

కాగా, మరోవైపు.. భారత్ కు చెందిన ఓ సంస్థపై యూఎస్ ఆంక్షలు అమలు చేస్తుంది. ఇరానియన్‌ పెట్రోలియం, పెట్రో కెమికల్స్ తో కలిసి బిజినెస్ చేస్తోందని అట్లాంటిక్‌ నావిగేషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ పై అమెరికా ఆంక్షలు విధించింది. దీని వల్ల ఇరాన్ కు బిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చి పెడుతున్న మరో నాలుగు సంస్థలు, మూడు నౌకలపైనా కూడా రిస్ట్రిక్షన్స్ విధించినట్లు ట్రెజరీ శాఖ వెల్లడించింది. టెహ్రాన్ తన అణు కార్యక్రమాల అభివృద్ధికి, ఆయుధ వ్యవస్థల విస్తరణకు దాని ప్రాక్సీలకు సపోర్టు ఇచ్చేందుకు ఈ నౌకలు, కంపెనీలపై ఎక్కువగా ఆధారపడుతుందని అమెరికా చెప్పుకొచ్చింది.