Asia Cup: ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా?.. ఆరోజు క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్ గురించి అభిమానులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఈ టోర్నీ పాకిస్తాన్‌లో జరగబోతుండటమే. దీంతో ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది అందరినీ ఆకర్షిస్తున్న అంశం. ఇదిలా ఉంటే, ఈ టోర్నీ కోసం ఇండియన్ టీమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ వెళ్లబోదని, టోర్నీనే మరో చోటుకు తరలిస్తామని గతేడాది ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పడం దుమారం రేపింది. దీనిపై అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా తీవ్రంగా స్పందించారు. అలా చేస్తే వరల్డ్ కప్‌ను తాము బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న నజమ్ సేతీ తాజాగా ఏసీసీపై ఒత్తిడి తీసుకొచ్చి ఓ అత్యవసరం మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఫిబ్రవరి 4వ తేదీన ఏసీసీ బహ్రెయిన్‌లో సమావేశం కానుంది. ఆసియా కప్ 2023 వేదికపై నిర్ణయం తీసుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందిస్తూ ఈ మధ్య తాను దుబాయ్ వెళ్లిన సమయంలో ఏసీసీ సభ్యులను ఈ అత్యవసర సమావేశానికి ఒప్పించినట్లు పీసీబీ చీఫ్ నజమ్ వెల్లడించారు.
Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ..ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు
Also Read
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
“ఏసీసీ బోర్డు ఫిబ్రవరి 4న బహ్రెయిన్‌లో సమావేశం కానుండటం చాలా పెద్ద ముందడుగు. ఈ మీటింగ్‌లో ఆసియా కప్‌కు సంబంధించిన అంశాలను చర్చిస్తాం. మార్చిలో ఐసీసీ మీటింగ్ కూడా జరగనుంది. ఏసీసీ సభ్యులతో నేను ఏం మాట్లాడాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అన్నది బయటపెట్టను. కానీ ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు మాత్రం చాలా ముఖ్యం” అని నజమ్ చెప్పారు.గతేడాది శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ అనుకోని పరిస్థితుల్లో యూఏఈకి తరలించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే దీనికోసం ఇండియన్ టీమ్ అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పారు. అవసరమైతే పాక్ నుంచే టోర్నీని తరలిస్తామని కూడా అన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!