India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
- అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం
- భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ
- ఆగస్టులో భారీగా సరఫరా చేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అన్ని రోజులు ఒకేలా ఉండవు’’ అంటారు పెద్దలు. రాజకీయాల్లో.. వ్యక్తిగత జీవితాల్లో ఇతరులను హెచ్చరించడానికి ఈ సామెత ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఈ సామెత ఇప్పుడు అక్షరాల టర్కీకి సరిపోతుంది. తత్వం బోధపడితేనే గానీ బుద్ధి రాదంటారు. ఇప్పుడు టర్కీ పరిస్థితి అలా అయిపోయింది. నిన్నామొన్నటిదాకా దాయాది దేశం పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతూ భారత్‌పై కాలుదువ్విన టర్కీకి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో భారత్‌ను శరణు వేడుతోంది. ఇంతకీ అసలేమైంది? టర్కీకి వచ్చిన దుస్థితి ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
మధ్యప్రాచ్యం యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇంధన సంక్షోభం ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయి. అంతెందుకు టర్కీ మిత్ర దేశమైన పాకిస్థాన్ అయితే విలవిలలాడుతోంది. ఇప్పటికే చమురు సంక్షోభం అలానే కొనసాగుతోంది. అయితే టర్కీ.. రష్యా నుంచి డీజిల్ సరఫరా చేసుకుంటుంది. అయితే ఈ మధ్య రష్యా నుంచి డీజిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇంధన సరఫరా మార్గాలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గం చూస్తే.. ఇప్పుడు భారతదేశమే కనిపించింది. దీంతో భారత్‌ను శరణు వేడడంతో కరుణ చూపించింది.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ఆగస్టులో రికార్డు స్థాయి సరఫరా..
Kpler గణాంకాల ప్రకారం.. 2026 ఆగస్టులో టర్కీకి భారత్ నుంచి రోజుకు 1.20 లక్షల బ్యారెళ్లకు పైగా డీజిల్ చేరింది. 2017 నుంచి Kpler గణాంకాలు అందుబాటులో ఉన్న కాలంలో ఇదే అత్యధిక నెలవారీ స్థాయి. అదే సమయంలో అమెరికా నుంచి టర్కీకి రోజుకు సుమారు 90 వేల బ్యారెళ్ల డీజిల్ దిగుమతి అయ్యింది. అమెరికా, భారత్ నుంచి వచ్చిన ఈ రెండు సరఫరాలు కూడా Kpler రికార్డుల్లో అత్యధిక నెలవారీ స్థాయికి చేరాయి. అయితే Energy Aspects గణాంకాలు భారత్ నుంచి టర్కీకి ఆగస్టు సరఫరాలను తక్కువగా, రోజుకు సుమారు 74 వేల బ్యారెళ్లుగా అంచనా వేశాయి. అయినప్పటికీ 2022 తర్వాత భారత్ నుంచి టర్కీకి నమోదైన అత్యధిక స్థాయిగా అది నిలిచింది.
టర్కీకి చాలా కాలంగా రష్యా ప్రధాన డీజిల్ సరఫరాదారుగా ఉంది. 2025లో టర్కీ డీజిల్ దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 85 శాతంగా ఉండేది. ఆ ఏడాది రష్యా నుంచి రోజుకు సుమారు 2.81 లక్షల బ్యారెళ్ల డీజిల్ టర్కీకి చేరినట్లు టర్కీ ఇంధన నియంత్రణ సంస్థ EMRA గణాంకాలు సూచిస్తున్నాయి. కానీ 2026 ఆగస్టులో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. Kpler ప్రకారం.. టర్కీ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న డీజిల్ రోజుకు సుమారు 80 వేల బ్యారెళ్లకు పడిపోయింది. జూలైలో ఇది సుమారు 1 లక్ష బ్యారెళ్లుగా ఉండగా, ఏడాది ప్రారంభ నెలల్లో 2 లక్షల బ్యారెళ్లకు పైగా ఉండేది. దీంతో ఆగస్టులో టర్కీ డీజిల్ దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 20 శాతానికి పడిపోయింది.
ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలోని కొన్ని రిఫైనరీలు దెబ్బతినడంతో దేశీయ ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో రష్యా డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ పరిణామం టర్కీ వంటి రష్యా డీజిల్‌పై ఆధారపడిన దేశాలను ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతకాల్సిన పరిస్థితిలోకి నెట్టింది. అదే సమయంలో మధ్యప్రాచ్యంలోని రిఫైనరీలపై యుద్ధ ప్రభావం పడటం, హార్ముజ్ జలసంధి మీదుగా నౌకాయానంలో అంతరాయాలు ఏర్పడటంతో ఈ ప్రాంతం నుంచి డీజిల్ సరఫరాలు కూడా తగ్గాయి. దీంతో ప్రపంచ డీజిల్ మార్కెట్లో సరఫరా పరిస్థితులు మరింత కఠినంగా మారాయి.
భారత్ వైపు ఎందుకు మళ్లింది?
రష్యా నుంచి వచ్చే డీజిల్ తగ్గడంతో టర్కీకి ఇతర దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా నుంచి సరఫరాలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్‌కు పెద్ద రిఫైనింగ్ సామర్థ్యం ఉండటం ఈ మార్పులో కీలక అంశంగా మారింది. భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుని దేశంలోని రిఫైనరీల్లో డీజిల్, పెట్రోల్ వంటి విలువైన పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ సరఫరా కొరత, ధరల వ్యత్యాసం ఉంటే అక్కడికి భారత రిఫైనరీల ఉత్పత్తులు చేరుతున్నాయి.
రిలయన్స్‌దే కీలక పాత్ర?
భారత్ నుంచి టర్కీకి పెరిగిన డీజిల్ సరఫరాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీలు ప్రధాన పాత్ర పోషించినట్లు మార్కెట్ డేటాను ఉటంకిస్తూ విశ్లేషణలు పేర్కొంటున్నాయి. సరఫరా అంతరాయాల కారణంగా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భారత రిఫైనరీల డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో భారత్ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా పెరిగాయి. ఏప్రిల్–ఆగస్టు 2026 మధ్య భారత్ పెట్రోలియం ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 46 శాతం పెరిగినట్లు Crisil Intelligence తెలిపింది.
రష్యా చమురు.. భారత్ రిఫైనింగ్..
ఇక్కడ మరో కీలక అంశం రష్యా ముడి చమురు. 2022 తర్వాత భారత రిఫైనరీలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఆ ముడి చమురును భారత్‌లోని రిఫైనరీల్లో శుద్ధి చేసి డీజిల్, పెట్రోల్ వంటి ఉత్పత్తులుగా మార్చుతున్నారు. అంటే భారత్ ఒకవైపు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తూనే.. మరోవైపు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ముడి చమురు, శుద్ధి చేసిన డీజిల్ ఒకే ఉత్పత్తి కాదన్నది ఇక్కడ కీలకం. రిఫైనింగ్ తర్వాత తయారైన డీజిల్ ప్రపంచ మార్కెట్లో ప్రత్యేకంగా ట్రేడ్ అవుతుంది.
భారత్ నుంచి భారీగా ఇంధనం!
పాకిస్థాన్‌కు టర్కీ కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ ఇంధన అవసరాల విషయంలో టర్కీ ప్రస్తుతం వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా భారత్ నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేస్తోంది. రష్యా సరఫరాలు తగ్గడం, మధ్యప్రాచ్య ఇంధన మార్గాల్లో అంతరాయాలు, ప్రపంచ డీజిల్ మార్కెట్లో కొరత వంటి పరిణామాల మధ్య టర్కీకి ప్రత్యామ్నాయ సరఫరాదారులు అవసరమయ్యారు. భారత్‌లో భారీ రిఫైనింగ్ సామర్థ్యం ఉండటంతో ఆ అవసరాన్ని తీర్చగల కీలక సరఫరాదారుల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఆగస్టు గణాంకాల్లో కనిపించిన రికార్డు స్థాయి దిగుమతులు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!