PCB Chief Mohsin Naqvi: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ లోనే టోర్నమెంట్ మొత్తం జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం.. ఈ విషయాన్ని ఇప్పటికే ఐసీసీ ఛైర్మన్‌కు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. భారతదేశం ఇక్కడ క్రికెట్ ఆడకపోతే.. పాకిస్తాన్ కూడా ఇండియాకు వెళ్లి ఆడటం సాధ్యం కాదని వెల్లడించారు. ఇక, మేము చెప్పాల్సింది మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు చాలా స్పష్టంగా చెప్పాం.. ఆ తరువాత ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చెప్పుకొచ్చారు.
Read Also: Crime News: జార్ఖండ్లో దారుణం.. లవర్ను చంపి 50 ముక్కలుగా నరికేశాడు..
ఇక, 2023 వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌కు వెళ్లినప్పటికీ.. ఇంకా ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ పేర్కొన్నారు. దీన్ని సాకుగా చూపించి పాక్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ రాకపోవడం మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌కు వెళ్లకూడదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి తమకు ఎలాంటి వ్రాతపూర్వక సమాచారం అందలేదని ఆయన ధృవీకరించారు. కాగా, వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌కు 8 జట్ల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఐసీసీ రేపు (నవంబర్ 29) బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
Read Also: Israel: అరెస్టు వారెంట్‌ను క్యాన్సిల్ చేయండి.. అంతర్జాతీయ కోర్టుకు ఇజ్రాయెల్
అయితే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ కలిగి ఉంది. కానీ, పాక్ లో ఆడేందుకు తమ క్రికెట్ జట్టును పంపకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం ప్రతిష్టంభనను సృష్టించింది. కొన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహిస్తే.. టోర్నమెంట్ లో పాల్గొంటామని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్ మోడల్‌ను స్వీకరించకూడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. భారతదేశం యొక్క భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చెప్పుకొచ్చారు. కానీ, పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు టీమిండియా సిద్ధంగా లేదని బీసీసీఐ మరోసారి తెలిపింది.