India-China Border: భారత్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా.. 26 గస్తీ పాయింట్లు కోల్పోయామన్న అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Lost 26 Patrol Points At Eastern Ladakh: భారత్-చైనా సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణం నెలకొంటూనే ఉంటుంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రానికి ఓ సంచలన నివేదిక అందింది. అందులో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. స్వయంగా మన దేశానికి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. భారత్ తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లు ఉండగా.. అందులో 26 గస్తీ పాయింట్లను కోల్పోయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం తూర్పు లద్దాఖ్ కారాకోరం పాస్ నుంచి చుమూర్ వరకు 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లో భారత సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. కానీ.. 26 చోట్ల(5-17, 24-32, 37)కు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయి’’ అని లేహ్ ఎస్పీ పీడీ నిత్య ఆ నివేదికలో వెల్లడించారు. గత వారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో ఆమె ఈ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.
Padma Awards 2023: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ఆ 26 చోట్ల భారత సాయుధ బలగాల గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని సాకుగా చూపించి.. ఆ భూభాగాలను చైనా కలిపేసుకుంటోందని నిత్య ఆ నివేదికలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొన్ని చోట్ల బఫర్ జోన్లను ఏర్పాటు చేయడం జరిగిందని.. అయితే వాటిని ఆసరాగా చేసుకొని సరిహద్దునను వెనక్కి నొడుతూ భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు.. భారత బలగాల కదలికల్ని గుర్తించేందుకు అక్కడి ఎత్తైనా శిఖరాలపై కెమెరాలను సైతం అమర్చినట్టు తెలిపారు. బఫర్ జోన్లోకి భారత సైన్యం ప్రవేశించిన వెంటనే.. ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదేనంటూ చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆ ప్రదేశం తమ భూభాగమని చైనా వాదిస్తోందని.. కొద్దిరోజుల నుంచి చైనా ఇలాగే ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తోందని ఆమె తన నివేదినలో స్పష్టం చేశారు. కాగా.. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్ ఆరోపించిన నెలరోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.
Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్పీ నేత తల్లి, భార్య దుర్మరణం
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!