Cannes Film Festival: ఇండియాకు గౌరవం.. అధికారిక హోదా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్లో అధికారిక దేశం హోదా కల్పించారు. దీంతో ఇండియాకు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యింది.
కాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా 75 వసంతాల వేడుక జరుపుకుంటోంది. ఈ ఏడాది జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన ప్రతిధ్వని చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ మూవీని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4కే టెక్నాలజీకి అనుగుణంగా మారుస్తున్నారు. మరో ఇండియన్ మూవీ థాంప్ అనే సినిమాను కూడా ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రానికి అరవిందన్ గోవిందన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలతో పాటు హాలీవుడ్ క్లాసిక్ మూవీ సింగిన్ ద రెయిన్ మూవీని కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. అటు బాలీవుడ్ భామ దీపిక పదుకునేకు అరుదైన గౌరవం లభించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో దీపికా పదుకునే సభ్యురాలిగా నియమితులైంది.
Also Read
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?