భారత్ – కాబూల్.. రోజుకు రెండు విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.. దీంతో.. అక్కడ చిక్కుకున్న మనవాళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన నెలకొంది.. ఈ తరుణంలో.. ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు ప్రతీ రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతిచ్చినట్టు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల నియంత్రణలో ఉన్నాయి. నాటో దళాలు.. తమ ఆయుధాలు, పౌరులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోజుకు మొత్తం 25 విమాన సర్వీసులను నడుపుతున్నాయి.
అందులో భాగంగా భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) రవాణా విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి కొంతమంది ఆఫ్ఘన్ ప్రముఖులు, హిందూ, సిక్కు ప్రజాప్రతినిధులతో పాటు విమానంలో 85 మంది భారతీయులు ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ రెండు సీ-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించింది. కాగా, ఆగస్టు 15న తాలిబన్లు ఆప్ఘాన్ రాజధాని కాబూల్‌ను సొంతం చేసుకున్నారు. ఎప్పుడైతే కాబూల్ తాలిబన్ల తుపాకీ నీడలోకి వెళ్లిందో.. ఆ మరుక్షణం నుంచే అక్కడి పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇండ్లు, కుటుంబాలు, సంపదించిన ఆస్తులను వదిలి పెట్టి కాబూల్‌లోని హమీద్ ఖర్జాయి ఎయిర్ పోర్టు దారి పట్టారు. వారం రోజులుగా ఎయిర్ పోర్టు చుట్టూ ఉన్న దారుల్లో ఇసకపోస్తే రాలలేనంత జనం గుమిగూడి ఉన్నారంటే అక్కడి పరిస్థిని అర్థం చేసుకోవచ్చు.
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- Tags
- Afghanistan
- citizens
- daily
- Flights
- india
తాజావార్తలు
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!