డబ్బు కోసమే అమెరికాతో చేతులు కలిపాం: ఇమ్రాన్‌ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌లపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్తాన్ భాగస్వామ్యం కావడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. కేవలం డబ్బు కోసమే అమెరికాతో తమ దేశం అప్పట్లో చేతులు కలిపిందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ”ఇతరులు మనల్ని వాడుకునేందుకు నాడు మనమే అవకాశమిచ్చాం. దేశ ప్రతిష్టను పణంగా పెట్టాం. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, డబ్బు కోసం విదేశాంగ విధానాన్ని రూపొందించాం. ఆఫ్ఘన్‌లో యుద్ధం మనకు మనమే చేసుకున్న గాయం.
దీనిపై ఇతరులెవర్నీ నిందించలేం” అని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఆఫ్ఘన్ విషయంలో అమెరికాతో కలిసి ముందుకెళ్లాలని 2001లో నిర్ణయం తీసుకున్నవారితో ఆ రోజుల్లో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని ఆయన తెలిపారు. దీంతో అప్పటి పరిస్థితులపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు నాడు తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే వచ్చాయని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆప్ఘాన్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ దేశాలు ఆప్ఘాన్ ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!