పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు సోదరీమణులకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో అడియాలా జైలు ఎదుట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోదరీమణులంతా జైలు ఎదుట ఆందోళన దిగారు. ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు అధికారులు హింసిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
25
వారానికోసారి ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు బంధువులకు అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఇమ్రాన్‌ఖాన్ చూసేందుకు వస్తే.. సోదరీమణులను లోపలికి అనుమతించలేదు. దీంతో తన సోదరుడిని జైలు అధికారులు హింసిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. చికిత్స కూడా అందించడం లేదని తెలిపారు. తన సోదరుడిని ఏకాంత నిర్బంధంలో ఉంచి హింసిస్తున్నారని అలీమా ఖార్ ఆరోపించారు. 8 నెలలుగా తమను కలవనివ్వడం లేదని.. లోపల ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చట్టవిరుద్ధంగా ఒంటరిగా ఉంచారని.. హింసించేందుకే ఇలా చేస్తున్నారని వాపోయింది.
ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వ్యాపి చెందాయి. పాకిస్థాన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో గత వారం ఒక సోదరీని జైలు లోపలికి అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్‌ను చూసి బయటకు వచ్చి తీవ్ర ఆరోపణులు చేశారు. తన సోదరుడిని ఒంటరిగా ఉంచి హింసిస్తున్నారని ఆరోపించింది. తాజాగా మరోసారి సోదరీమణులంతా తీవ్ర ఆరోపణలు చేశారు. తన సోదరుడిని హింసిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
