NTV Telugu Site icon

US- Russia: రష్యా బలహీనపడింది.. అందుకే కిమ్‌ సైన్యం మద్దతు కోరుతుంది..!

Russia

Russia

US- Russia: రష్యా- ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నామని యూఎస్ తెలిపింది. ఒకవేళ నార్త్ కొరియా సైన్యం ఉక్రెయిన్‌ యుద్ధంలోకి చొరబడితే.. ఖచ్చితంగా వాళ్లు కూడా తమ లక్ష్యంగా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి జాన్‌కిర్బీ ప్రకటించారు. అసలు కిమ్‌ జోంగ్ ఉన్ సైన్యం మద్దతు తీసుకోవడం క్రెమ్లిన్‌ బలహీనపడిందనే విషయం తెలియజేస్తోందని అతడు ఎద్దేవా చేశారు. ఇక, ఉత్తర కొరియాలోని వాన్సాన్‌ అనే ప్రాంతం నుంచి నౌకలో సైనికులు రష్యాలోని వ్లాదివాస్తోక్‌ చేరుకుంటున్నారనే విషయం మాకు తెలిసింది.. అక్కడి నుంచి పలు మిలటరీ ట్రైనింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారని అమెరికా ఆరోపించింది. ఈ సైనికులను ఎక్కడ వాడుకొంటారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని యూఎస్ వెల్లడించింది. రష్యన్లతో పాటు వీరు కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది.. ముఖ్యంగా ఉత్తర రష్యాలోని ఉక్రెయిన్‌ సరిహద్దులకు వీరు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని జాన్ కిర్బీ వెల్లడించారు.

Read Also: Surya : అన్ స్టాపబుల్ సెట్లో కంగువ..

ఇక, వీరు యుద్ధ భూమిలో అడుగుపెడితే.. అది రష్యా నిరాశ, నిస్పృహను తెలుపుతుందని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు క్రెమ్లిన్‌ ఈ పోరులో తీవ్రంగా నష్టపోయింది. కానీ, పుతిన్‌ ఈ యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇష్టపడుతున్నారు.. మాస్కో దగ్గర సైన్యం కొరవడి.. ప్యాంగ్‌యాంగ్‌ను ఆశ్రయించడమంటే అది బలహీనపడిందనే సంకేతం వస్తుందన్నారు. అలాగే, ఉత్తర కొరియా సైన్యానికి రష్యా నుంచి సహాయసహకారాలు అందడం అనేది ఐక్యరాజ్య సమితి ఆంక్షల ఉల్లంఘన కిందకు వస్తుందని కిర్బీ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సపోర్టుగా నార్త్ కొరియా మరో 1500 మంది సైనికులను తరలించిందని బుధవారం దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ తెలిపింది. డిసెంబర్‌ నాటికి 10,000 మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని ప్యాంగ్‌యాంగ్‌ ప్రణాళికలు వేస్తుందన్నారు. అయితే, ఇప్పటికే ఉక్రెయిన్‌పై పోరాడేందుకు ఉత్తర కొరియా ఈ నెలలో రష్యాకు 1,500 మందిని ప్రత్యేకదళంగా పంపినట్లు ధ్రువీకరించిన సౌత్ కొరియా గూఢచార సంస్థ.

Show comments