US Government: డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించిన కాంగ్రెస్..
- రుణ పరిమితి పెంపు బిల్లును తిరస్కరించిన కాంగ్రెస్..
- బిల్లు ఆమోదానికి లభించని 3/2 మెజారిటీ..
- 174–235 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయినట్లు ప్రకటించిన స్పీకర్ మైక్ జాన్సన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Government: సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు జో బైడెన్ ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిని పెంచేందుకు కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ (పార్లమెంటు హౌస్ ) గురువారం నాడు తిరస్కరించింది. దీంతో యూఎస్ సర్కార్ షట్‌డౌన్ నివారణకు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయినట్లైంది. ఈ పరిణామంతో పలు ఫెడరల్ సంస్థల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. అమెరికన్ కాంగ్రెస్ హౌస్ కొన్ని ఫెడరల్ సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలకు 3/2 మెజారిటీతో సకాలంలో ఆమోదం తెలపకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. యూఎస్ పార్లమెంటులో డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ పార్టీకి నామమాత్రపు మెజారిటీ మాత్రమే ఉండటంతో.. షట్‌డౌన్ ప్రభావం సమాఖ్య సర్కార్ చేసే 25 శాతం వ్యయానికే పరిమితమైంది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
కాగా, 174–235 ఓట్ల తేడాతో రుణ పరిమితి పెంపు బిల్లు వీగిపోయింది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి తుది ప్రయత్నంగా తమ ప్రతిపాదనలను మరోసారి సభలో ప్రవేశ పెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులకు ఇచ్చే సహాయంతో పాటు రైతులకు ఆర్థిక సాయం కలిపి 110 బిలియన్ డాలర్లను జో బైడెన్ సర్కార్ వ్యయ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, రుణ పరిమితి పెంచితేనే ఓకే చేస్తామని ట్రంప్ అనుకూలురు తెలిపారు. ఈ బిల్లుపై స్పష్టత రాకుంటే ప్రభుత్వ పాలన స్తంభించే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?