China: చైనాలో కోవిడ్ కల్లోలం.. ఆస్పత్రుల్లో బెడ్లు లేవు.. బ్లాక్ మార్కెట్లో మందులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hospitals run out of beds as Covid patients increase in China: చైనాలో కోవిడ్ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. అక్కడి లక్షల్లో ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు. మరణాలు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని బీజింగ్ లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ లోని అన్ని ఆస్పత్రుల్లో బెడ్లు అన్ని నిండిపోయాయి. రోగులు హాల్ లో స్ట్రెచర్లపై పడుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీల్ చైర్ లో ఆక్సిజన్ తీసుకుంటున్నారు కొందరు రోగులు. రోగుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ పడకలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చికిత్స తీసుకుంటున్న వారిలో వృద్ధులే అధిక మంది ఉంటున్నారు. మరోవైపు రోగుల సంఖ్య పెరగడంతో వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బందిపై ఒత్తడి పడుతోంది.
Read Also: African Swine Flu: మధ్యప్రదేశ్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం.. పందుల చంపివేత
Also Read
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
ఇక శ్మశాన వాటికలు కూడా కోవిడ్ రోగుల శవాలతో నిండిపోతున్నాయి. ఓమిక్రాన్ బీఏ.5.2, బీఎఫ్.7 వేరియంట్లు చైనాను అల్లకల్లోలం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే ఈ రెండు వేరియంట్ల వల్ల దేశంలో రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల చైనా ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఓ అంచనా ప్రకారం ఈ నెలలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని.. చైనా దేశస్తుల్లో 60 శాతం మంది కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో జనవరి 1 వరకు ఏకంగా 2,20,000 కేసులు నమోదు అయ్యాయి.
ఇదిలా ఉంటే చైనాలో కరోనా మందుల కొరత కూడా వేధిస్తోంది. అక్కడ ప్రజలు బ్లాక్ మార్కెట్లో మందులను కొనుగోలు చేస్తున్నారు. జ్వరం, జలుబు మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా చాలా మెడికల్ షాపుల్లో ఈ మందులు లభించడం లేదు. డిమాండ్ ను ఆసరా చేసుకుని కొంతమంది వీటిని బ్లాక్ చేస్తున్నారు. దీంతో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. చైనా మందులు దొరక్కపోవడంతో చాలా మంది భారత తయారీ మందులను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
视频【帝都朝阳医院内景】1 pic.twitter.com/O0z3jJze0K
— 章立凡 ©️Zhang Lifan💎 (@zhanglifan) December 26, 2022
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!