అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గత కొద్దిరోజులుగా కార్చిచ్చు చెలరేగుతోంది. ఇప్పటికే భవంతులు, వేలాది ఎకరాలు కాలి బూడిదయ్యాయి. కోట్లాది రూపాయుల ఆస్తి మంటల్లో కాలిపోయింది. తాజాగా ఈ మంటల్లో హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ (95) సజీవ దహనం అయినట్లు బంధువులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా దృవీకరించారు. ఇంట్లో కాలిపోయిన అవశేషాలను అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: బీజేపీ ఓటర్లకు బంగారు గొలుసుల్ని ఇస్తోంది..
ది బ్లూస్ బ్రదర్స్, ది టెన్ కమాండ్‌మెంట్స్, లేడీ సింగ్స్ ది బ్లూస్ పాత్రలకు రిటైర్డ్ హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ పేరు ప్రఖ్యాతలు గడించారు. అయితే కార్చిచ్చు చెలరేగడంతో ఆమె తప్పించుకోలేకపోయారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కాలిఫోర్నియాలోని అల్టాడెనాలోని ఆమె ఇంటిలో అవశేషాలు గుర్తించారు. ఇల్లు కూడా ధ్వంసమైంది.
ఇది కూడా చదవండి: West Bengal: టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం
డాలీస్ కర్రీ చివరిసారిగా జనవరి 7 సాయంత్రం కనిపించింది. ఆమె మనవరాలు డాలీస్ కెల్లీ.. ఆమెను ఇంటి దగ్గర దింపి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం కెల్లీ.. డాలీస్ కర్రీని గుర్తించే ప్రయత్నం చేసింది. కానీ ఆచూకీ లభించలేదు. ఆమెను వెదికేందుకు ప్రయత్నం చేయగా.. పోలీస్ బారికేడ్లు కారణంగా ఆమెను అడ్డుకున్నారు. సమీపంలోని ఆశ్రయ కేంద్రాలకు వెళ్లింది. కానీ ఫలితం దక్కలేదు. చివరికి విషాదంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. తన అమ్మమ్మ చనిపోయిందని జనవరి 12న సోషల్ మీడియా వేదికగా డాలిస్ కెల్లీ పేర్కొన్నారు.
డాలీస్ కర్రీ మృతిపై అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సేవలను సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. వృద్ధాప్యంలోనూ చాలా చురుగ్గా ఉండేవారని గుర్తుచేసుకుంటున్నారు. మొత్తానికి కార్చిచ్చుకు ఆమె బలైపోయింది.
ఇది కూడా చదవండి: Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు