India-Canada: కెనడా రాకుండా పన్నూని నిషేధించాలి.. ప్రభుత్వాన్ని కోరిన హిందూ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే కొందరు ఖలిస్తానీ ఎలిమెంట్స్ మాత్రం ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేలా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతతలు పెంచేలా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇండియాకు, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కెనడాలో ఆందోళన, నిరసన చేపడుతున్నారు. మరోవైపు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హిందువులను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.
Read Also: USA: “ఫ్లాష్ మాబ్” తరహాలో యాపిల్ స్టోర్‌ని కొల్లగొట్టారు.. వీడియో వైరల్..
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ఇదిలా ఉంటే పన్నూ కెనడాలోకి రాకుండా నిషేధం విధించాలని ‘హిందూ ఫోరమ్ కెనడా(హెచ్ఎఫ్సీ)’ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల ఓ వీడియోలో పన్నూ మాట్లాడుతూ.. కెనడియన్ హిందువులు కెనడాను వదిలి ఇండియాకు వెళ్లిపోవాలని, వారు కెనడా రాజ్యాంగాన్ని పాటించడం లేదని, సిక్కుల మాత్రమే కెనడా చట్టాలకు, రాజ్యాంగానికి మద్దతుగా ఉంటున్నారని హెచ్చరించాడు. దీనిపై హిందూ సంస్థ.. హిందువులు, భారతీయుల్లో భయాన్ని వ్యాప్తి చేశాడని ఆరోపిస్తోంది.
హెచ్ఎఫ్సీ న్యాయ సలహాదారు పీటర్ థోర్నింగ్ కెనడా ఇమ్మిగ్రేషన్, పౌరసత్వ మంత్రి మార్క్ మిల్లర్ తో భేటీ అయ్యారు. పన్నూ కెనడాకు రాకుండా అతడిని నిషేధించాలని కోరారు. పన్పూను భారతదేశం 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్ నుంచి పంజాబ్ వేరు చేసి ప్రత్యేక ఖలిస్తాన్ దేశం ఏర్పాటు చేయాలని, ఇండియాకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్నాడు. సిక్కు యువతను తప్పుదోవపట్టిస్తున్నాడు. ఇతనిపై దేశంలో పలు కేసులు ఉన్నాయి. ఇదే కాకుండా పన్నూకు పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో లింకులు ఉన్నాయి. కెనడాలో భారతీయ మూలాలు ఉన్న వారు 4 శాతం మంది ఉన్నారు.
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!