Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ ఆటోడ్రైవర్ హత్య..
- బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య..
- ఆటోడ్రైవర్‌ను కొట్టి చంపిదన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. మరో హిందూ యువకుడిని కొట్టి చంపారు. ఆటోడ్రైవర్ అయిన 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్‌ను పథకం ప్రకారం కొట్టి చంపినట్లు తేలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చిట్టగాంగ్‌లోని దగన్‌భూయాన్‌లో జరిగింది. దాడి చేసిన దుండగులు మొదట దాస్‌ను కొట్టి, ఆపై కత్తితో పొడిచి చంపారు. దీని తర్వా ఆతడి ఈ-ఆటో రిక్షాతో పారిపోయారు. ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నిందితుల్ని గుర్తించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.
Read Also: Municipal Elections: మున్సిపల్ ఓటర్లు 51,92,220 మంది.. తుది జాబితా విడుదల చేసిన ఈసీ..
Also Read
- Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్‌ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైమన్‌సింగ్ నగరంలో దీపుచంద్ర దాస్ హత్యతో మొదలైన ఈ మారణకాండకు అడ్డుకట్టపడటం లేదు. గడిచిన 40 రోజుల్లో 10 మందికి పైగా హిందువుల హత్యలకు గురయ్యారు. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య మండలి, దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాలపై పెరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మైనారిటీలపై హింసాత్మక దాడులు ఎక్కువయ్యాయి.
బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీల పట్ల బంగ్లా తీరును భారత్ తీవ్రంగా విమర్శిస్తోంది. బంగ్లా తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ ఈ మారుణకాండను అడ్డుకోవడం లేదు. పైగా భారత్ వీటిని ఎక్కువ చేసి చూపిస్తోందని యూనస్ ఆరోపిస్తున్నాడు. “బంగ్లాదేశ్‌లోని తీవ్రవాదులు మైనారిటీలపై, వారి ఇళ్ళు, సంస్థలు, వ్యాపార సంస్థలపై ఆందోళనకరమైన దాడులను మేము చూస్తూనే ఉన్నాము. ఇటువంటి మత సంఘటనలను త్వరగా మరియు దృఢంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం అన్నారు.
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!