Israel-Hezbollah War: నస్రల్లా వారసుడు వచ్చేశాడు.. హిజ్బుల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్ ఎన్నిక
- హసన్ నస్రల్లా వారసుడు వచ్చేశాడు
- హిజ్బుల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్బుల్లాకు కొత్త చీఫ్ వచ్చేశాడు. హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత హిజ్బుల్లాకు కొత్త లీడర్ వస్తారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి అయోమయం.. గందరగోళం చోటుచేసుకుంది. తొలుత నస్రల్లా వారసుడిగా బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను ఎన్నుకోవాలని హిజ్బుల్లా భావించింది. కానీ అతడు కూడా తమ చేతుల్లో చనిపోయాడని ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదిలా ఉంటే సీనియారిటీ ప్రకారం నస్రల్లా వారసుడిగా నయీం ఖాసిమ్ ముందు వరుసలో ఉన్నారు. కానీ నస్రల్లా మరణం తర్వాత ఇతడు ప్రాణభయంతో ఇరాన్ పారిపోయినట్లుగా వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు నస్రల్లా వారసుడిగా నయీం ఖాసిమ్‌నే ఎన్నుకున్నట్లు మంగళవారం హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Kerala CM Convoy Accident: రోడ్డుపై స్కూటీతో మహిళ విన్యాసం?.. సీఎం కాన్వాయ్కి ప్రమాదం(వీడియో)
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా స్థానంలో డిప్యూటీ హెడ్ నయీం ఖాసిమ్(71)ను ఎన్నుకున్నట్లు లెబనీస్ సాయుధ సమూహం హిజ్బుల్లా మంగళవారం పేర్కొంది. వ్రాతపూర్వకమైన ప్రకటనలో తెలిపింది. 1991లో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నయీం ఖాసిమ్ ఎన్నికయ్యారు. హమాస్‌లో 30 ఏళ్లుగా సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. హిజ్బుల్లాలో అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు ఉంది. అంతేకాదు మంచి వ్యూహకర్తగా కూడా పేరుంది. ఇక నస్రల్లా హత్య తర్వాత మూడు ప్రసంగాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారు. ఒకటి బీరుట్ నుంచి, రెండు టెహ్రాన్ నుంచి ప్రసంగాలు చేశారు. అంతేకాదు కాల్పుల విరమణ ఒప్పందాలకు కూడా పలుమార్లు మద్దతు తెలిపారు. కానీ అవేమీ ఫలించలేదు.
ఇది కూడా చదవండి: Minister Narayana: పొదుపు సంఘాల మహిళలు వ్యాపారాలు చేస్తే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!