
రష్యాలోని కజన్ నగరంలో ఓ స్కూల్లో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 మంది విద్యార్ధులు మృతి చెందారు. మరి కొందరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్కూల్ లోపల తుపాకుల శబ్డం వినిపిస్తుండగా ఇద్దరు విద్యార్ధులు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకడం ఆ వీడియోలో కనిపించింది. ఇక ఈ ఘటనకు కారణమైన 19 ఏళ్ల దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ ఘటనకు గల కారణాలు ఎంటి అన్నది తెలియాల్సి ఉన్నది. రష్యాలో 2018 లో ఇలాంటి సంఘటన జరిగింది. క్రిమియాలో ఓ విద్యార్ధి జరిపిన కాల్పుల్లో 19 మంది విద్యార్ధులు మృతి చెందారు. ఆ తరువాత అలాంటి ఘటన ఇప్పుడు జరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.