NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ తీరే అక్కడి ప్రజలు.. గల్ఫ్ దేశాల్లో అడుక్కుతింటున్నారు..

Pakistani Labourers.

Pakistani Labourers.

Pakistan: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం ముందు భిక్షమెత్తుకుంటోంది. ఇక పాక ప్రజలు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్తున్న వారు అక్కడ భిక్షాటన చేస్తుండటం ఆ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. గల్ఫ్ దేశాల్లో అరెస్టైన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తానీలే అని కువైట్ ఆందోళన వ్యక్తం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), సౌదీ అరేబియా, ఖతార్ మరియు కువైట్‌తో సహా అనేక గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ ప్రవాసులు, లేబర్స్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

Read Also: Akhilesh Yadav: పార్లమెంట్‌లో వాటర్ లీకేజీపై అఖిలేష్ విమర్శలు

ఓవర్సీస్ పాకిస్థానీలపై ఇస్లామాబాద్‌లో జరిగిన సెనేట్ స్టాండింగ్ కమిటీ పాకిస్తానీస్ ప్రతినిధి డాక్టర్ అర్షద్ మహమూద్ ఈ విషయాన్ని లేవనెత్తారు. పాకిస్తానీల ప్రవర్తనపై గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఈ దేశాల్లోని 50 శాతం నేరాల్లో పాకిస్తానీల ప్రమేయం ఉంటోందని చెప్పారు. యూఏఈ దుబాయ్‌లో మహిళల ముందు వీడియోలు తీస్తున్నారని, కువైట్ పాకిస్తాన్ నర్సుల గురించి సమస్యల్ని లేవనెత్తింది. వారు స్థానిక భాషను నేర్చుకోరు, నేర్చుకునేందుకు ప్రయత్నించరని, దేశంలో ఆరు నెలలు ఉన్న తర్వాత యూరప్ వెళ్లాలని అనుకుంటున్నారని కువైట్ చెప్పింది. తీర్థయాత్రలకని చెప్పి ఇరాన్, సౌదీల్లో పాకిస్తానీలు భిక్షాటన చేస్తున్నారు.

ప్రతీ ఏడాది 6 లక్షల నుంచి 8 లక్షల మంది పాకిస్తానీలు దేశం వదిలివెళ్తున్నారని, కేవలం 2 లక్షల-3 లక్షల మందే తిరిగి వస్తున్నారని అర్షద్ కమిటీ తెలిపింది. ఈ పరిస్థితి దేశానికి చెడ్డపేరు తెస్తుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే కార్మికులు ఉపాధి పొందేందుకు అనుమతిస్తామని సౌదీ అరేబియా ఇప్పుడు ప్రకటించింది. మిగతా గల్ఫ్ దేశాలు కూడా పాక్ లేబర్స్‌ని వద్దని చెబుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతీ ఏడాది విద్యావంతులు పాక్‌ని వదిలేసి వెళ్తున్నారు.