ఊబకాయం.. ప్రస్తుతం ఎంతోమందికి సమస్యగా మారింది.  బరువు తగ్గడం కోసం ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు.

 బరువు తగ్గడానికి కొన్ని సులభమైన, సహజమైన మార్గాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.\

 నడక: ఓ నివేదిక ప్రకారం, నడక మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి.  

హైడ్రేషన్:  తగినంత నీటిని తీసుకోవడం ద్వారా శరీరం మెరుగుపడుతుంది. నీరు కావాల్సినన్ని తాగడం వల్ల అప్పుడప్పుడు ఆకలి బాధలు తగ్గుతాయి. 

  పండ్లు: ఉదయం పూట పండ్లు తినడం చాలా మంచిది. పండ్లు, కూరగాయలు కేలరీల స్థాయిని పెంచకుండా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. 

ఆపిల్, నారింజ, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. 

పౌష్టికాహారం: బరువు తగ్గాలనుకునే వారికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.  

  అల్పాహారం, భోజనం, రాత్రి భోజనంతో సహా అన్ని సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలి.

 ముఖ్యంగా రాత్రిపూట సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి. ఉదయాన్నే  ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 

యోగా: వేగవంతమైన జీవనశైలి నుండి ఒత్తిడిని తగ్గించడానికి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా గొప్ప మార్గం.  

  డ్యాన్స్: బరువు తగ్గడానికి ఉత్తమ మార్గాలలో డ్యాన్స్ ఒకటి. డ్యాన్స్ ద్వారా కేలరీలు కరిగిపోతాయి.