Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..

  • గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
  • రష్యా ఆయిల్ కొనుగోలుకు మినహాయింపు..
  • భారత్ మరింత రష్యా ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం..
  • మరోవైపు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్..
Russian Oil

Russian Oil

Russia Oil: ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అల్లాడింది. ఇప్పుడు ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తానని చెప్పడంతో చమురు రవాణాకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా చమురుపై అమెరికా మరోసారి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. గతంలో ఇచ్చిన మినహాయింపును పొడగించేది లేదని అమెరికా ట్రెజరీ స్వయంగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వచ్చింది. తాజా నిర్ణయంతో భారత్ మరింత రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఏర్పడింది.

Read Also: Iran-US Talks: ఇరాన్-అమెరికా తదుపరి చర్చలపై అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!

ఏప్రిల్ 17 నుండి అమల్లోకి వచ్చే మినహాయింపుల కోసం అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఒక కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం, మే 16 వరకు దేశాలు రష్యా చమురు,పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. దాదాపుగా ఒక నెల పాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చు. ఈ వార్త భారత్‌కు శుభపరిణామం. రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల ఇంధన ధరలు స్థీరికరించబడుతాయి. గతంలో అమెరికా ఇచ్చిన 30 రోజుల మినహాయింపు ఏప్రిల్ 11న ముగిసింది. ఈ సమయంలో మరోసారి అమెరికా రష్యన్ ఆయిల్ విషయంలో యూటర్న్ తీసుకుంది.

మరోవైపు, ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తామని ప్రకటించిన వెంటనే చమురు ధరలు 10 శాతం పడిపోయాయి. ప్రపంచ చమురు, గ్యాస్‌లో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత ఇరాన్ ఈ మార్గాన్ని దిగ్భందించింది. దీంతో ప్రపంచ చమురు రంగం సంక్షోభంలో పడింది. ఇప్పుడు ఇరాన్, అమెరికా వరస నిర్ణయాలతో ప్రపంచంలో చమురు సమస్య తప్పింది.