Gabon: సైన్యం గుప్పిట్లోకి మరో ఆఫ్రికా దేశం.. గాబన్‌లో సంక్షోభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gabon: ఆఫ్రికా దేశాల్లో వరసగా సైనిక తిరుగుబాటులు జరుగుతున్నాయి. ఇప్పటికే నైగర్ దేశంలో సైనిక తిరుగుబాటు ప్రపంచాన్ని మరోసారి యుద్ధం వైపు నడిపించే విధంగా ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని ఫ్రాన్స్ తో పాటు అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు భావిస్తుంటే మరోవైపు రష్యా ఉంది.
నైగర్ సమస్య ముగియకముందే మరో ఆఫ్రికా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. గాబన్ దేశాన్ని ఆ దేశ ఆర్మీ స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశానికి చెందిన అన్ని అధికార సంస్థల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పాలనకు ముగింపు పలుకతున్నామని గాబనీస్ ఆర్మీ తెలిపింది.
Also Read
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
ఒక డజన్ మంది గాబనీస్ సైనికులు బుధవారం ఆ దేశ టెలివిజన్ లో కనిపించి ప్రస్తుత పాలనకు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా గెలిచిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని లిబ్రేవిల్లేలో ఉద్రిక్తతల నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కాల్పుల మోత వినిపించినట్లు సమాచారం.
Read Also: China: ప్రజల దృష్టిని మళ్లించే పనిలో డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్, తైవాన్‌పై దాడికి ప్లాన్ చేస్తుందా..?
ప్రస్తుత పాలనను అంతం చేయడం ద్వారా శాంతిని కాపాడాలని మేము నిర్ణయించుకున్నామని సైన్యానికి చెందిన ఓ అధికారి గాబన్ 24 ఛానెల్ లో చెప్పారు. ఆగస్టు 26, 2023 సాధారణ ఎన్నికలు రద్దు చేయబడ్డట్లు అతను ప్రకటించాడు. గాబన్ దేశ ప్రభుత్వం, సెనెట్, జాతీయ అసెంబ్లీ, రాజ్యంగా న్యాయస్థానం రద్దు చేయబడుతున్నట్లు తెలిపాడు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దేశ సరిహద్దుల్ని మూసేస్తున్నట్లు ప్రకటించాడు.
14 ఏళ్లుగా అధ్యక్షుడు బొంగో అధికారంలో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి 64.27 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చాడు. అతను గెలిచినట్లు జాతీయ ఎన్నికల అథారిటీ ప్రకటించిన వెంటనే సైన్యం దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బొంగో ప్రత్యర్థిగా ఉన్న ఆల్బర్ట్ ఓండో ఒస్సా కేవలం 30.77 శాతం ఓట్లను సాధించాడు. ఇతను బొంగో మోసంతో గెలిచాడని ఆరోపిస్తున్నాడు. బొంగో ప్రభుత్వం తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..