మహిళలకు గర్భం దాల్చడం అనేది వారి జీవితంలో కలిగే మధురానుభూతి. మహిళలు గర్భం దాలిస్తే కడుపులోని బిడ్డ గర్భాశయంలో పెరగడం సాధారణ విషయం. కానీ ఓ మహిళకు మాత్రం కడుపులోని బిడ్డ కాలేయంలో పెరుగుతుండటం వైద్యులనే ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే… కెనడాలోని 33 ఏళ్ల మహిళకు వింత అనుభవం ఎదురైంది. తాను గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించిన తరువాత 14 రోజులుగా రుతుస్రావం అవుతుండటంతో ఆమె చెకప్ చేయించుకునేందుకు వైద్యుల వద్దకు వెళ్లింది. అయితే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్…