Bees Mistory Death: అమెరికా కాలిఫోర్నియాలో గతేడాది ఒకే రాత్రిలో దాదాపుగా 30 లక్షల తేనెటీగలు మరణించాయి. అయితే ఇవన్నీ ఒకే రాత్రి ఎలా మరణించాయనేది మిస్టరీగా మారింది. కాలిఫోర్నియాలోని సాంక్చుయరీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే దీని వెనక ఉన్న మిస్టరీని నిపుణులు ఛేదించారు.
Read Also: Telugu Students: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద మృతి
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్(USDA) నిపుణులు తేనెటీగల సామూహిక మరణాలపై పరిశోధన చేయగా.. కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తేనెటీగలు ప్రాణాంతక విషానికి గురైనట్లు తేలింది. USDA నివేదిక ప్రకారం, ఫిప్రోనిల్ విషం కారణంగా తేనెటీగలు చనిపోయాయని తేలింది. ఫిప్రోనిల్ అనేది వ్యవసాయంలోనే నిషేధించబడిన క్రిమిసంహారక మందు. ఇది కీటకాల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి చనిపోయేలా చేస్తుంది. తేనెటీగల మరణాలు గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగితే తాజాగా ఈ నెలలో USDA తన ఫలితాలను బహిరంగపరిచింది. అయితే తేనెటీగలు ఈ విషపూరిత పదార్థాన్ని ఎలా తిన్నాయో తెలియరావడం లేదు.
తేనెటీగల సాంక్చుయరీ కార్మికుడు డోమినిక్ పెగ్ మాట్లాడుతూ.. దీంట్లో దురుద్దేశం దాగి ఉందని ఆరోపించారు. సమీపంలో అన్ని తోటల్లో ఫిప్రోనిల్ ఉపయోగించలేడం లేదని చెప్పారు. ఫిప్రోనిల్ మానవులకు కూడా హానికరం, చెమటలు, వికారం, వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి, మైకము మరియు మూర్ఛలకు కారణమవుతాయి.