UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- ఇస్లామిక్ శక్తుల చేతుల్లోకి బ్రిటన్..
- సంచలన వ్యాఖ్యలు చేసిన యూకే మాజీ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: యూకే మాజీ మంత్రి, హోం సెక్రటరీగా పనిచేసిన సుయెల్లా బ్రేవర్‌మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా మళ్లీ గొప్పగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రిటన్ ‘‘ముస్లిం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. రాబోయే రెండు దశాబ్దాల్లో వెస్ట్రన్ దేశాలు ఇరాన్ తరహా పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చని చెప్పారు. బ్రేవర్‌మాన్ రైట్ వింగ్ థింక్ ట్యాంక్, హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Maruti Suzuki Jimny: ‘మేడ్ ఇన్ ఇండియా’.. జపాన్‌లో లాంచ్ అయిన “జిమ్నీ ఫైవ్-డోర్”
Also Read
ఇటీవల అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్‌పై బ్రేవర్‌మాన్ ప్రశంసలు కురిపించారు. యూకే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన అత్యంత కరుడుగట్టిన జాతీయవాద నేతల్లో బ్రేవర్‌మాన్ ఒకరు. వలసవాదుల్ని బహిష్కరించాలని పలు సందర్భాల్లో ఆమె వ్యాఖ్యానించారు. రిషి సునాక్ యూకే ప్రధానిగా ఉన్న సమయంలో 2023లో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. తాజా ప్రసంగంలో ఆమె ప్రస్తుతం యూకేలోని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించారు.
‘‘నేషనల్ కన్జర్వేటిజం సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ.. యూకే అణ్వాయుధాలు కలిగిన మొదటి ఇస్లామిక్ దేశంగా అవతరించబోతుందని చెప్పారు’’. అయితే అతను తమాషా చేస్తున్నానని నేను అనుకోవడం లేదని బ్రేవర్ మాన్ చెప్పారు. రాబోయే రెండు దశాబ్ధాల్లో చైనా లేదా రష్యా కాకుండా యూకేనే అమెరికాకు అతిపెద్ద ముప్పుగా ఎలా ఉంటుందో ఆమె అంచనాలు చెప్పారు. యూకేలోని విచ్ఛిన్న రాజకీయాలను, షరియా చట్టం వ్యాప్తి గురించి చర్చించారు.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?