UK: యూకే మాజీ మంత్రి, హోం సెక్రటరీగా పనిచేసిన సుయెల్లా బ్రేవర్‌మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా మళ్లీ గొప్పగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రిటన్ ‘‘ముస్లిం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. రాబోయే రెండు దశాబ్దాల్లో వెస్ట్రన్ దేశాలు ఇరాన్ తరహా పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చని చెప్పారు. బ్రేవర్‌మాన్ రైట్ వింగ్ థింక్ ట్యాంక్, హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.