ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోన్న రష్యాకు పెద్ద షాక్ తగిలింది.. ఇప్పటికే రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన యూరోపియన్ యూనియన్.. కీలకమైన స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించింది. రష్యా ఆర్థిక వ్యవస్థను గట్టి దెబ్బకొట్టేందుకు ఆఖరి అస్త్రంగా స్విఫ్ట్‌ను ప్రయోగించింది. ఇక, రష్యాను స్విఫ్ట్‌నుంచి తొలగించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తంచేశారు. ఇది తమ దేశ చరిత్రలో కొత్త అధ్యాయమన్నారు జెలెన్స్కీ తాము ఈయూలో భాగం అవుతామని ప్రకటించారు. అయితే, స్విప్ట్ నుంచి రష్యాను తొలగించడం ద్వారా ఆర్థిక సేవల సమాచారం పొందదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఆ దేశం దూరంగా ఉంటుంది. రష్యన్లు వారి కంపెనీలు దిగుమతులకు నగదు చెల్లింపులను సకాలంలో చెల్లించలేరు. అలాగే ఎగుమతులకు సంబంధించిన సొమ్మును అందుకోలేరు. రష్యా నుంచి విదేశాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు. ఆ దేశానికి చెందినవారు ఎటువంటి సమాచారం కోసమైనా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు
మరోవైపు, రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు తమకు సైనిక సాయం అందించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. దీంతో రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్‌కు రెండు వేల 630 కోట్ల రూపాయల విలువైన సైనిక సాయాన్ని విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌కు జారీ చేసిన మెమోరాండంలో.. విదేశీ సహాయ చట్టం ద్వారా నిధులను ఉక్రెయిన్ రక్షణ కోసం కేటాయించాలని ఆదేశించారు. దీనికి అదనంగా మరో 350మిలియన్ డాలర్ల మిలటరీ సాయాన్ని అందించనుంది. మరోవైపు ఉక్రెయిన్‌కు రూ.10.16 వేల కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ఈయూ నిర్ణయించినట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మెక్రాన్ తెలిపారు. అంతకుముందు తనను కీవ్ నుంచి సురక్షిత ప్రాంతానిక తరలిస్తామంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. మిత్ర దేశాల నుంచి తమకు ఆయుధాలు, సామగ్రి సరఫరా అవుతోన్నట్లు చెప్పారు. అదే సమయంలో తమకు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, తమపై అమెరికా, యూరోపియన్ యూనియన్ విధిస్తున్న ఆంక్షలు ఎలాంటి ఫలితాన్ని చూపబోవని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని డొన్బాస్ ప్రాంతాన్ని రక్షించే మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్పుతిన్అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఈ సైనిక చర్య ఆగదని రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్తేల్చి చెప్పారు.