ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయినా పురోగతి లభించలేదు. ఇదిలా ఉంటే ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే రష్యా.. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఆదివారం రష్యా జరిపిన వైమానిక దాడిలో కైవ్‌లోని ప్రధాన ప్రభుత్వ భవనం తగలబడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో దారుణం.. రైల్లో ఉక్రెయిన్ శరణార్థి హత్య
ఇక ఆదివారం న్యూయార్క్ నగరంలో జరిగిన యూఎస్ ఓపెన్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ నుంచి ట్రంప్ తిరిగి వచ్చిన తర్వాత విలేకర్లతో మాట్లాడారు. కైవ్‌లో ప్రభుత్వ భవనం తగలబడిపోవడంపై తాను ఏ మాత్రం సంతోషంగా లేనని చెప్పారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడతానని చెప్పారు. యుద్ధానికి పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా పరిష్కరించాలో చర్చించడానికి వ్యక్తిగతంగా కలిసేందుకు యూరోపియన్ నేతలంతా సోమవారం లేదా మంగళవారం అమెరికాకు వస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. ఈ సమావేశం తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: నేడు గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 15న అలాస్కాలో పుతిన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. శాంతి ఒప్పందంపై చర్చించారు. కానీ పుతిన్ మూడు షరతులు విధించారు. అనంతరం జెలెన్‌స్కీ, యూరోపియన్ నేతలతో కూడా ట్రంప్ చర్చించారు. ఇరు పక్షాలతో చర్చలు జరిపినా పరిష్కారం దొరకలేదు. ఇంతలోనే రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తూనే ఉంటోంది. మరోసారి ఇరు పక్షాలతో ట్రంప్ చర్చలు జరపనున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
