గ్రీన్లాండ్ విషయంలో మిత్ర దేశాల మధ్య రగడ మొదలైటట్టు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని ఎప్పటి నుంచో ట్రంప్ కలలు కంటున్నారు. ప్రస్తుతం ఆ ఒత్తిడి మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది. వెనిజులాను స్వాధీనం చేసుకున్నాక.. ఇప్పడు ఫోకస్ అంతా గ్రీన్లాండ్పైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం డెన్మార్క్ ఆధ్వర్యంలో గ్రీన్లాండ్ ఉంది. ఈ డెన్మార్క్ నాటోలో భాగంగా ఉండడంతో ట్రంప్ నిర్ణయాన్ని యూరోపియన్ దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకుంటామంటే ఊరుకోమని ప్రత్యక్షంగా వార్నింగ్ ఇస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Spain: స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 21 మంది మృతి
ఇక తన ప్రణాళికకు యూరోపియన్ దేశాలు అడ్డు తగులుతుండడంతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1, 2026 నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తామని.. అంతేకాకుండా జూన్ 1 నుంచి 25 శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా భద్రతకు గ్రీన్లాండ్ చాలా అవసరం అని.. దాని మీద ఒప్పందం కుదరకపోతే.. అవసరమైతే బలవంతంగానైనా తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
ఇక ట్రంప్ ప్రకటనపై యూరోపియన్ దేశాలు, నాటో నాయకత్వం తిరుగుబావుటా ఎగరవేశారు. ట్రంప్ ప్రకటనను తీవ్రంగా తప్పుపట్టాయి. తాజాగా యూరోపియన్ దేశాధినేతలంతా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశమై ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. యూరోపియన్ దేశాలపై ట్రంప్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని.. ఇలాగైతే అమెరికన్ కంపెనీలను యూరోపియన్ మార్కెట్ నుంచి మినహాయించాలని కోరనున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా అమెరికాపై 93 బిలియన్ యూరోల సుంకాలు విధించాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇక ఈ వారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు యూరోపియన్ దేశాలు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇక ట్రంప్‌కు యూకే ప్రధాని స్టార్మర్ ఫోన్ చేసి అలాంటి చర్యలు తప్పు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అట్లాంటిక్ సంబంధాలు అస్థిరపరిచే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. అలాగే డానిష్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో విడివిడిగా స్టార్మర్ ఫోన్ చేసి మాట్లాడారు. గ్రీన్లాండ్ విషయంలో ఐక్యతకు పిలుపు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గ్రీన్లాండ్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికాతో యూరోపియన్ దేశాలు పరోక్ష యుద్ధానికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.