Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్‌తో సెల్ఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఇండో – పసిఫిక్ టెక్ సదస్సులో ఒక ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన (EV) రంగంలో దిగ్గజాలైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్, షియోమీ సీఈఓ లీ జున్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమే కాకుండా, సెల్ఫీ దిగడం ఇప్పుడు గ్లోబల్ టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా ప్రతినిధి బృందంతో కలిసి చైనా పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ కోసం బీజింగ్‌లో ఒక అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో షియోమీ వ్యవస్థాపకుడు లీ జున్ స్వయంగా మస్క్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి చిరునవ్వుతో సెల్ఫీ దిగారు. ఈ ఫోటో నెట్టింట ప్రత్యక్షం కావడమే ఆలస్యం.. నిమిషాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధించింది.
ఆ విందులో ఎలాన్ మస్క్ ఒక స్టార్ సెలబ్రిటీలా మారిపోయారు. అక్కడికి వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రతినిధులు ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. మస్క్ కూడా తనదైన శైలిలో 360-డిగ్రీల సెల్ఫీలు తీసుకుంటూ అందరినీ ఉత్సాహపరిచారు. చైనాలో లీ జున్ను ‘చైనా మస్క్’ అని పిలుస్తుంటారు. గతంలో టెస్లా మోడల్ 3 ఉత్పత్తి సంక్షోభంలో ఉన్నప్పుడు మస్క్ ఫ్యాక్టరీ ఫ్లోర్‌పైనే నిద్రించేవారు. సరిగ్గా అలాగే, షియోమీ తన లక్షవ ఎలక్ట్రిక్ కారును పూర్తి చేసిన సందర్భంలో లీ జున్ కూడా ఫ్యాక్టరీలో నిద్రిస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఇది మస్క్ స్టైల్‌ను కాపీ కొట్టడమే అని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
పోటీదారుల మధ్య స్నేహం..
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో టెస్లాకు షియోమీ గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా షియోమీ విడుదల చేసిన SU7 ఎలక్ట్రిక్ కారు చైనాలో టెస్లా మోడల్ 3కి ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి వ్యాపార పోటీ ఉన్నప్పటికీ, ఇద్దరు అగ్రనేతలు ఎంతో సరదాగా గడపడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “త్వరలోనే టెస్లా ఆప్టిమస్ రోబోట్, షియోమీ రోబోట్లు కూడా ఇలాగే సెల్ఫీలు దిగుతాయేమో” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అమెరికా – చైనా మధ్య టెక్నాలజీ, ఏఐ (AI), సప్లై చైన్ అంశాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో మస్క్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన ఈ ఇద్దరు నేతల కలయిక, భవిష్యత్తులో ఈవీ (EV) రంగంలో మరిన్ని సంచలనాలకు నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?