Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Earths Poles Are Moving And Will Flip Why Is That A Cause Of Worry

Magnetic reversal: భూమి “అయస్కాంత ధృవాలు” రివర్స్ అవుతున్నాయి.. ప్రళయం ముంచుకొస్తుందా..?

Published Date :May 15, 2024 , 8:57 pm
By Venu Goapl Reddy
Magnetic reversal: భూమి “అయస్కాంత ధృవాలు” రివర్స్ అవుతున్నాయి.. ప్రళయం ముంచుకొస్తుందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Magnetic reversal: సమస్త జీవావరణానికి భూమి ఆధారం. ప్రస్తుతం మనకు తెలిసిన విశ్వంలో భూమి మాత్రమే జీవులకు అనుకూలంగా ఉంది. భూమి మనకు తెలియకుండానే మనకు రక్షణ కల్పిస్తోంది. భూమి మధ్యలో కోర్ తిరగడం వల్ల భూమి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమిపైకి విశ్వం, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అణువులను, కాస్మిక్ కిరణాలను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భూమికి ఉండే ఈ అయస్కాంత క్షేత్రం సౌర తుఫానులు, సౌర జ్వాలల నుంచి జీవావరణాన్ని రక్షిస్తోంది. ఇది ఒక బుడగ మాదిరిగా భూమి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది.

Read Also: Loksabaha Elections 2024: ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ నామినేషన్ తిరస్కరణ..

ఇదిలా ఉంటే ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం.. భూమి అయస్కాంత ధృవాలు మారుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఉత్తర, దక్షిణ ధృవాలు పరస్పరం మారుతున్నాయని బీబీసీ సైన్స్ ఫోకస్ వెల్లడించింది. 1990ల వరకు ఉత్తర ధృవం ఏడాదికి 15 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ రేటు ఏడాదికి 55 కిలోమీటర్ల మేర సైబీరియా వైపు పెరిగింది. ఈ కదలిక ఉత్తర, దక్షిణ ధృవాల స్థానాలను మార్చే ‘‘మాగ్నెటిక్ రివర్సర్’’కి దారి తీయవచ్చు. నాసా ప్రకారం.. 83 మిలియన్ ఏళ్లలో ఇది 183 సార్లు జరిగింది. అయితే, ఈ ప్రక్రియ మధ్య సమయాలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సగటున సుమారు 3,00,000 ఏళ్లకు ఒకసారి ఇలా మాగ్నెటిక్ రివర్సల్ చోటు చేసుకున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఒకానొక దశలో ధృవాలు మారే సందర్భంలో మాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అవుతుంది.

అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే పరిస్థితి ఏంటి..?

భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సమస్త జీవులను, సాంకేతిక వ్యవస్థలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అదృశ్య కవచం భూమి యొక్క అంతర్భాగం నుండి అంతరిక్షంలోకి విస్తరించి, ఒక రక్షిత బుడగను ఏర్పరుస్తుంది. సూర్యుని నుండి వెలువడే ఆవేశిత కణాల ప్రవాహం నుండి గ్రహాన్ని కాపాడుతుంది. అయితే ఈ కీలకమైన అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే? విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత దెబ్బతింటుంది. ప్రాణాంతక రేడియేషన్ భూమిని చేరుతుంది. తద్వారా జీవ కణాల మ్యుటేషన్ రేటు పెరుగుతుంది. జంతువుల్లో క్యాన్సర్‌లకు దారి తీస్తుంది. వాతావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. సౌర కుటుంబంలో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అంగారకుడిపై కూడా నీరు ఉండేది. అయితే దానికి భూమిలా బలమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడంతో ఈ గ్రహం ఇప్పుడు బంజేరు భూమిలా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • earth magnetic field
  • Earth magnetic poles
  • Earth's Poles
  • magnetic reversal

తాజావార్తలు

  • RCB Vs LSG: టాస్ గెలిచిన ఆర్సీబీ.. జట్టులోకి స్టార్ ప్లేయర్..

  • Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్

  • Pakistan Cricket: పాక్ జట్టులో కలకలం.. కోచింగ్, కెప్టెన్సీలపై కీలక నిర్ణయం..!

  • Trump-China: హార్ముజ్ తెరిచి ఉంచాం.. చైనా సంతోషంగా ఉందన్న ట్రంప్

  • Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions