Earthquake: జపాన్ దేశంలో భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.33 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. జపాన్ రాజధాని టోక్యోకు తూర్పు ఆగ్నేయంగా 107 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 65 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. ప్రపంచంలో 6 కన్నా ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాల్లో ఐదోవంతు ఈ దేశంలోనే సంభవిస్తుంటాయి. జపాన్ ప్రాంతం అత్యంత చురుకైన భూకంపాల ప్రాతంలో ఉంది.
Read Also: Aditi Arya: కళ్యాణ్ రామ్ హీరోయిన్.. మంచి బిలియనీర్ని పట్టేసిందే..
జపాన్ పసిఫిక్ సముద్రంలోని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇది ఆగ్నేయాసియా నుంచి పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించించి ఉంది. ఈ ప్రాంతంలో భూకంపాలు అధికం. సముద్రగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల నిరంతర కదలికల వల్ల భూకంపాలు ఏర్పడుతుంటాయి. అండర్ వాటర్ అగ్నిపర్వతాల క్రియాశీలక చర్యలు కూడా భూకంపాలకు కారణం అవుతుంటాయి.