Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..
- డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా
- డచ్ యువరాణుల హత్యకు నాజీ కుట్ర
- పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డచ్ యువరాణులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు బయటపడింది. భవిష్యత్ డచ్ రాణి, 22 ఏళ్ల యువరాణి కాథరీనా-అమాలియా, 20 ఏళ్ల యువరాణి అలెక్సియా లను హత్య చేయాలని ప్రణాళిక వేశారు. ఈ కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అతడు ఫార్-రైట్ (దక్షిణపక్ష) తీవ్రవాద భావజాలం, ముఖ్యంగా నాజీ ప్రేరణతో ప్రభావితమై ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుట్ర వెనుక అసలు ఉద్దేశ్యం ఇంకా పూర్తిగా తెలియరాలేదు. హేగ్ (The Hague) పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం, నిందితుడు సోమవారం (మే 4) కోర్టులో హాజరవుతాడు.
ఫిబ్రవరి 2026లో హేగ్‌లో అరెస్టు చేయబడిన 33 ఏళ్ల అనుమానితుడి వద్ద రెండు గొడ్డళ్లు లభ్యమయ్యాయి. వాటిపై “అలెక్సియా”, “మొస్సాద్” (ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ), నాజీ యుగపు నినాదం “సీగ్ హీల్” (Sieg Heil) అనే పదాలు లిఖించి ఉన్నాయి. అంతేకాకుండా, అతని వద్ద చేతితో రాసిన ఒక కాగితం కనుగొన్నారు. దానిపై ఇద్దరు యువరాణుల పేర్లు (“అమాలియా”, “అలెక్సియా”)తో పాటు “రక్తపాతం” లేదా “బ్లడ్‌బాత్” (bloodbath) అనే పదం రాసి ఉంది.
Also Read
- Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
- Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
- Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
- Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
యువరాణి అమాలియా గతంలో కూడా అనేక బెదిరింపులను ఎదుర్కొంది. మాజీ ప్రధాని మార్క్ రుట్టేను కిడ్నాప్ చేయాలని మాదకద్రవ్యాల ముఠాలు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. భద్రతా కారణాలతో 2022లో ఆమ్స్టర్డామ్లోని తన హాస్టల్‌ను వదిలి హేగ్‌లోని రాజభవనానికి మారాల్సి వచ్చింది. 2024లో చదువు కోసం స్పెయిన్ (మాడ్రిడ్)లో రహస్యంగా కొంతకాలం గడిపింది. భద్రతా ఆంక్షల వల్ల సాధారణ విద్యార్థి జీవితం గడపలేకపోతున్నానని ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించింది. “వీధుల్లో నడవడం, దుకాణాలకు వెళ్లడం వంటి సాధారణ విషయాలు చాలా కోరుకుంటున్నాను” అని ఆమె చెప్పారు. ఆమె తల్లి క్వీన్ మాక్సిమా కూడా ఈ బెదిరింపులు కుమార్తెపై తీవ్ర ప్రభావం చూపాయని, ఆమె ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
తాజావార్తలు
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
2027 Kawasaki Z900: Kawasaki Z900 బైక్ భారత్ లో లాంచ్.. 5-ఇంచ్ TFT డిస్ప్లే, 948cc ఇంజిన్, ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?