NTV Telugu Site icon

Taliban: పాకిస్తాన్‌పై తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన..

Taliban

Taliban

Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్‌లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.

Read Also: Canadian Plane: రఫ్ ల్యాండింగ్.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన కెనడా విమానం..

ఈ వారం ప్రారంభంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) రహస్య స్థావరాలను లక్ష్యంగా పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మంది ప్రజలు చనిపోయారు. దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరించారు. దాదాపుగా 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్ సరిహద్దులకు చేరుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుని పాకిస్తాన్ భూభాగం పరిగణించడం లేదని, అది తమదే అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖ్వారిజ్మీ అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను వేరు చేసే ‘‘డ్యూరాండ్ లైన్’’ని ఆఫ్ఘన్ ఎప్పటి నుంచో ఒప్పుకోవడం లేదు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం కూడా తమదే అని ఆఫ్ఘన్ వాదన. శుక్రవారం ఖోస్ట్, పక్తికా ప్రావిన్సుల నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్, కుర్రం ప్రాంతాలపై తాలిబన్లు దాడులు చేశారు.

Show comments