Trump – Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్‌కు పుతిన్ అర్ధరాత్రి ఫోన్.. 90 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump – Putin: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శనివారం అర్ధరాత్రి దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘ ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రంప్‌కు పుతిన్ శుభాకాంక్షలు తెలపడంతో ప్రారంభమైన ఈ సంభాషణ.. చివరకు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే వ్యూహాల వైపు మళ్లిందని చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడి అత్యంత నమ్మకస్తుడు, విదేశాంగ వ్యవహారాల సహాయకుడు యూరి ఉషాకోవ్ ఈ చర్చల వివరాలను అధికారికంగా వెల్లడించారు.
కేవలం ఫార్మాలిటీ కాదు..
“ఈ ఏడాది పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన నాలుగో అధికారిక సంభాషణ ఇది. ఇది కేవలం ఒక సాధారణ ఫార్మాలిటీ కాదు. అత్యంత నిర్మాణాత్మకంగా, పనిపై స్పష్టమైన ఫోకస్‌తో ఈ చర్చలు జరిగాయి. అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న అన్ని అంశాలపై ఇరు దేశాల నేతలు బహిరంగంగా మాట్లాడుకున్నారు” అని ఉషాకోవ్ అధికారికంగా వెల్లడించారు. ఈ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్న వాస్తవ పరిస్థితిని పుతిన్.. ట్రంప్‌కు వివరించారు. ప్రస్తుతం రష్యా సైన్యం లైన్ ఆఫ్ కాంటాక్ట్ వెంబడి అన్ని వైపులా వేగంగా దూసుకుపోతోందని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభంపై యూరప్ దేశాల అవగాహన పూర్తిగా తప్పని ఈ సందర్భంగా రష్యా పేర్కొంది.
Also Read
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
మధ్యవర్తిత్వానికి ట్రంప్ రెడీ..
వచ్చే వారం టర్కీలో జరగబోయే నాటో సదస్సులో ఈ యుద్ధానికి ముగింపు పలికేలా మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా ప్రత్యేక దౌత్యవేత్తలు స్టీవ్ విట్కాఫ్, జెరెడ్ కుష్నర్ ఈ శాంతి ఒప్పందం కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారని, అవసరమైతే వారు మరోసారి మాస్కో పర్యటనకు వచ్చేందుకు రెడీగా ఉన్నారని ట్రంప్ తెలిపినట్లు సమాచారం. రష్యా, అమెరికాల మధ్య సైనిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారానికి బోలెడు అవకాశాలు ఉన్నాయని, అయితే ఈ సహకారం పునరుద్ధరించబడాలంటే ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం లభించడమే మొదటి షరతు అని ట్రంప్ నొక్కి చెప్పారని తెలుస్తోంది. మరోవైపు, కీవ్ (ఉక్రెయిన్), దాని యూరోపియన్ మిత్రదేశాలు యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయని, సాధారణ పౌరులపై ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నాయని ఉషాకోవ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. క్రెమ్లిన్ నిర్దేశించిన అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన నిర్ణయాలను ఆమోదించడానికి సిద్ధంగా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వయంగా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి మాస్కో రావచ్చని స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని ఆశించే శక్తులన్నీ ఇప్పుడు పుతిన్ – ట్రంప్ డీల్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.
తాజావార్తలు
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
-
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!