NTV Telugu Site icon

Trump: హమాస్‌కు ట్రంప్ చివరి వార్నింగ్.. వెంటనే బందీలను విడుదల చేయాలని హెచ్చరిక

Trumpwarning

Trumpwarning

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు మరోసారి తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే అంతు చూస్తానంటూ చివరి హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Jaishankar: లండన్‌ టూర్‌లో ఉగ్ర కలకలం.. జైశంకర్‌‌పై ఖలీస్తానీ ఉగ్రవాది దాడికి యత్నం

బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మరణించిన వారి మృతదేహాలను కూడా తిరిగివ్వాలని కోరారు. లేకుంటే తగిన ఫలితం అనుభవిస్తారని తెలిపారు. తాను చెప్పినట్లు వినకపోతే హమాస్‌లో ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండరని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన బందీలతో మాట్లాడినట్లు చెప్పారు. గాజా ప్రజల కోసం మంచి భవిష్యత్ ఉంది.. త్వరగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Crime News: హైదరాబాద్లో దారుణం.. కర్రతో కొట్టి చంపిన స్నేహితుడు

ఇప్పటికే ట్రంప్ పలుమార్లు హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఫలానా టైమ్‌కి విడుదల చేయకపోతే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకే తెలియదని ఇటీవల ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కానీ హమాస్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఒప్పందం ప్రకారమే బందీలను విడుదల చేసింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తామని మరోసారి ట్రంప్ ప్రకటించారు. పాలస్తీనియన్లు.. ఈజిప్ట్, జోర్డాన్ వెళ్లి ఉండొచ్చని ట్రంప్ సూచించారు. కానీ ఈ ప్రకటనను అరబ్ దేశాలు ఖండించాయి.

ఇది కూడా చదవండి: Hamas-US: అమెరికా బందీల విడుదల కోసం హమాస్‌తో వైట్‌హౌస్ రహస్య చర్చలు

ఇదిలా ఉంటే మరోవైపు హమాస్‌తో వైట్‌హౌస్ రహస్యంగా చర్యలు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికన్ బందీలను విడుదల చేయాలని హమాస్‌ను అమెరికా అధికారులు కోరినట్లు వార్తలు వినిపిస్తు్నాయి.

1997లో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. అప్పటి నుంచి హమాస్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. అయితే 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి హమాస్ చెరలోనే మగ్గుతున్నారు. ఇటీవల ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కొందరు బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇంకా ఇజ్రాయెల్, విదేశీ బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే వారిని విడిపించేందుకు నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధి ఆడమ్ బోహ్లర్.. నేరుగా హమాస్‌తో చర్చలు జరిపి.. బందీలను విడుదల చేయాలని కోరారు.

ప్రస్తుతం హమాస్ చెరలో 59 మంది బందీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బందీల్లో 5 మంది అమెరికన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొంత మంది బందీలు చనిపోయారు. అయితే వారి విడుదల కోసం వైట్ హౌస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్.. ఖతార్ ప్రధాన మంత్రిని కలవాలని అనుకున్నారు. కాల్పుల విరమణ గురించి చర్చించాలని భావించారు. కానీ అందుకు హమాస్ ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. దీంతో స్టీవ్ విట్కాఫ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఈ ఒప్పందం గత శనివారంతో ముగిసింది. మరో దఫా ఒప్పందం జరగాల్సి ఉంది. కానీ దీనిపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. బందీలను విడుదల చేయకపోతే అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లు.. గాజాను విడిచి పెట్టాలని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా మరోసారి యుద్ధానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Off The Record: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నయా ప్లాన్..?