నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక చాలా ఉల్లాసంగా సాగినట్లుగా కనిపిస్తోంది. వాతావరణం పూర్తిగా ఆమెకు అనుకూలంగా మారింది. ఇక ఆమె రాకను ప్రజలే కాదు.. ప్రకృతి కూడా పులకించింది. సునీతా విలియమ్స్‌ను తీసుకొచ్చిన క్యాప్సూల్.. సముద్రంపై ల్యాండ్ కాగానే ఆమె చుట్టూ డాల్ఫిన్ల గుంపు తిరుగుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.