America Cat: సాధారణంగా ఆఫీసుల్లో పనులు చేయించుకోవడానికి ఉద్యోగులను నియమించుకుంటారు. ఉద్యోగులు అంటే మగవారు ఉంటారు.. ఆడవారు కూడా ఉంటారు. ఉద్యోగులు వారు పనిలో చేరగానే వారు ఏమేమీ పనులు చేయాలో ముందుగా చెబుతారు. ఆ తరువాత వాటిపై శిక్షణ కూడా ఇస్తారు. మరికొందరు అయితే ఏకంగా అనుభవం ఉన్న వారినే ఉద్యోగులుగా తీసుకుంటారు. కొందరు అనుభవం లేని వారిని తక్కువ వేతనాలతో తీసుకొని వారికే శిక్షణను ఇస్తుంటారు. ఉద్యోగులు ఆఫీసుల్లోనే కాకుండా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు తదితర వాటిల్లో కూడా ఉద్యోగులను తీసుకుంటారు. ఉద్యోగులుగా ఇటు ఆడవారు.. అటు మగవారిని కాకుండా జంతువులను తీసుకునే అవకాశం ఉంటుందా? ఎక్కడైనా ఇలా నియామకం చేస్తారా? అనేది సందేహం. అయితే అటువంటి సందేహాన్ని అమెరాకా విమానయాన శాఖ నివృత్తి చేస్తూ అందరూ విస్తుపోయేలా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయంలో ఉద్యోగిగా ఏకంగా పిల్లిని నియమించింది. ఇందుకు సంబంధించిన ట్విట్టర్ పోస్టు వైరల్ అవుతుంది.
Read also: Yash : కోట్లు ఖరీదైన కారు కొన్న హీరో యష్..!!
Cat: | అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త ఉద్యోగిని నియమించుకుంది. ఎయిర్ పోర్ట్ లోకి ప్రవేశించగానే ఆ ఉద్యోగి ప్రయాణికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ఉద్యోగి ఎవరా అని అనుకుంటున్నారా?.. అది ఒక పిల్లి. అవును మీరు చదివింది నిజమే.. అది ఒక పిల్లి. దాని పేరు డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్ .. తన ఉద్యోగం ఏమిటో తెలుసుకుందాం..
Read also: AP Education System: గతంలో విద్య అంటే కేరళ, ఢిల్లీ.. ఇప్పుడు ఏపీవైపు చూస్తున్నారు..!
విమాన ప్రయాణం అంటే కొందరు భయపడిపోతుంటారు. టెన్షన్ ఫీల్ అవుతుంటారు (Nervous Flyers). అలాంటి వారి కోసం విమానాశ్రయ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. వారిలోని భయాన్ని , టెన్షన్ ని పోగొట్టాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఓ పిల్లిని అక్కడ నియమించుకున్నారు. తలపై టోపీ, యూనిఫాం తో ఆ పిల్లి ఎంతో ఠీవిగా తిరుగుతోంది. ఇతర ఆఫీసర్లతో సమానంగా ఈ పిల్లిని కూడా చూసుకుంటున్నారు సిబ్బంది. మోరిస్ పని ఏంటంటే.. ప్రయాణికుల ఆందోళనను తగ్గించడం. విమాన ప్రయాణంలో భయాందోళనకు గురయ్యే వారు మోరిస్ తో కాసేపు గడిపితే చాలు టెన్షన్ మొత్తం పోతుందట. ఆపై భయపడకుండా విమాన ప్రయాణం చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఆ పిల్లికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు వారు తెలిపారు.