Yash : కోట్లు ఖరీదైన కారు కొన్న హీరో యష్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో అయిన యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని తెచ్చుకున్నాడు యష్.ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కేజిఎఫ్ సినిమా తర్వాత అభిమానులు చాలామంది యష్ ని రాఖీ బాయ్ అనే ముద్దుగా పిలుస్తున్నారు.. కేజీఎఫ్ 1 మరియు కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపును సంపాదించాడు యష్. కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు యాడ్స్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.కేజీఎఫ్ మూవీ తర్వాత యష్ లైఫ్ స్టైల్ అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా యష్ లగ్జరీ కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే కొనుగోలు చేసిన ఆ కారు గురించే అనేక రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
తాజాగా యష్ ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ ను కొనగోలు చేశాడు. కాగా ఈ కారు ఖరీదు సుమారు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.. ఇండియన్ మార్కెట్లో బడా వ్యాపారులు అలాగే సినీ తారలు ఎక్కువగా కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్ కూడా ఒకటి. ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ కారుతో పాటు ఇప్పటికే యష్ వద్ద మెర్సిడెస్ బెంజ్ డీఎల్ఎస్ 350 డి, ఆడి క్యూ 7, అలాగే రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ మరియు మెర్సిడెస్ జీఎల్సి 250 డి కూపే లాంటి భారీ లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కార్ కు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అందులో యష్ తో పాటు ఆయన భార్యా పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది..కారు కొన్న సందర్బంగా ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెజిఎఫ్ 2 తో భారీ హిట్ కొట్టిన యష్,ప్రశాంత్ నీల్ కాంబో కెజిఎఫ్ 3 కి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!