New York: మన భారత దేశంలో దీపావళి, రంజాన్, గుడ్ ఫ్రైడే ఇలా ప్రతి పండగకు సెలవలు ఇస్తారు. ఎందుకంటే మన దేశంలో అన్ని మతాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారు. కనుక మన దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తుంది. ఇక తాజాగా హిందువుల పండుగల్లో ఒకటైన దీపావళి వేడుకలు దేశ వ్యాపతంగా జరిగాయి. దీపావళి సందర్భంగా ఆ జోరు పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించారు. అయితే హిందువులు జరుపుకునే పండుగ అయినటువంటి దీపావళికి ఇక పైన అగ్ర రాజ్యం అమెరికాలో కూడా సెలవలు ఇవ్వనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు శుభవార్త చెప్పింది. ఇక పైన అమెరికా లోని న్యూయార్క్ లోని ప్రభుత్వ పాఠశాలలకు దీపావళి రోజున సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టం కూడా రూపుదిద్దుకోగా గవర్నర్ కేథీ హోచుల్ తాజాగా చట్టంపై సంతకం చేశారు.
Read also:Congress Manifesto: రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కనుక ఇక నుంచి భారతీయ కేలండర్ ప్రకారం పాఠశాలలకు దీపావళి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేథీ మాట్లాడుతూ.. ‘న్యూయార్క్‌లో విభిన్న సంస్కృతులకు చెందిన వారు జీవిస్తారు. కనుక భిన్నత్వాన్ని పాఠశాలల్లో సంబరంలా జరుపుకోవడం అవసరం’ అని తెలిపారు. ఇక ముందు భారత కేలండర్ ప్రకారం దీపావళికి పాఠశాలలకు సెలవు ఇచేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్కడి అధికారులు తీసుకున్న నిర్ణయంపైన హిందువులు హర్షం వ్యక్తం చేశారు. ఇలా అగ్ర రాజ్యంలో తమ పండుగకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు అక్కడి ప్రజలు.