Site icon NTV Telugu

Trump vs Musk: ఎలాన్ మస్క్ అక్రమ గ్రహాంతరవాసి.. అమెరికా వదిలి వెళ్లిపోవాలి..

Trump

Trump

Trump vs Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మధ్య బహిరంగ విమర్శలు చేసుకోవడం వరల్డ్ వైడ్ గా ఆసక్తి రేకెత్తిస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు కలిసి తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్‌ బెనాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతడ్ని దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థను సీజ్‌ చేయాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్‌ వేరియంట్‌.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?

ఇక, అమెరికా ప్రభుత్వం ఎలాన్ మస్క్‌ ఇమ్మిగ్రేషన్‌ అంశంపై విచారణ చేయాలని స్టీ్వ్ బెనాన్‌ డిమాండ్ చేశారు. ఎందుకుంటే అతడు వేరే గ్రహం నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చినట్లున్నారు.. వెంటనే ఆయన్ను దేశ బహిష్కరణ చేయాలని కామెంట్స్ చేశారు. కొరియా యుద్ధం నాటి చట్టాల ప్రకారం.. దేశ రక్షణ ఉత్పత్తులు, ఆయుధాలు, వైద్య సామగ్రి తదితర ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. ఈ మేరకు ప్రైవేట్ వ్యాపారులను ఆదేశించే అధికారం అధ్యక్షుడిగా ట్రంక్ హక్కు ఉంటుంది అన్నారు. ఆ చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్‌ వెంటనే ఉపయోగించాలని స్టీవ్ బెనాన్‌ కోరారు.

Read Also: Nara Lokesh: ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు.. మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు..

ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం తక్షణమే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను విడుదల చేసి.. స్పేస్‌ఎక్స్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలని మాజీ వైట్ హౌస్ సలహాదారు బానాన్ పేర్కొన్నారు. అర్ధరాత్రిలోగా ఆ సంస్థను సీజ్‌ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా యూఎస్ రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌ నుంచి చైనాకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎలాన్ మస్క్‌ దొంగలించేందుకు ప్రయత్నించారని తీవ్రంగా ఆరోపించారు. వెంటనే, మస్క్‌కు భద్రత నిలిపివేయాలి, అంతేకాకుండా అతడికి చెందిన సంస్థలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని స్టీవ్ బానాన్ చెప్పుకొచ్చారు.

Exit mobile version