Pakistan: పాకిస్తాన్లో డెంగ్యూ కలకలం.. ఈ ఏడాది 30 వేలకు పైగా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue outbreak In Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్.. ప్రస్తుతం రోగాల బారినపడింది. అక్కడ ప్రజలు అనారోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. భారీ వరదలు, వర్షాల కారణంగా అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ దేశం డెంగ్యూ కోరల్లో చిక్కుకుంది. దీనికి తోడు తీవ్ర మందుల కొరతను కూడా ఎదుర్కొంటోంది ఆ దేశం. పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో గత 24 గంటల్లో 104 డెంగ్యూ కేసులు నమోదు అవ్వడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Read Also: Salman Khan: గాడ్‌ఫాదర్‌కి సల్మాన్ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాక్
Also Read
- Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. "జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం".. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
- Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
- Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
- Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
పాకిస్తాన్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు 30,267 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఇస్లామాబాద్ నగరంలో ఇప్పటి వరకు 2435 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. దాయాది దేశంలో డెంగ్యూ కారణంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. సింధ్ ప్రావిన్సులో ఇప్పటి వరకు 9,496 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. 37 మంది మరణించారు. పంజాబ్ ప్రావిన్సులో 6,564 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. 18 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో 8,070 కేసులు నమోదు కాగా.. ఏడుగురు మరణించారు, బలూచిస్తాన్ ప్రావిన్సులో 3,402 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు ఇటీవల సంభవించిన వరదల కారణంగా బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్సులు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు ఖైబర్ ప్రావిన్సుల్లో కూడా భారీ స్థాయిలో వరదలు సంభవించాయి. మూడింట ఒక వంతు పాక్ భూభాగం నీటితో నిండి ఉంది. వరదల కారణంగా చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. అయితే వరదల కారణంగా ఆ దేశంలో అంటు వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి.
తాజావార్తలు
-
Dhanush Politics: విజయ్ తర్వాత రాజకీయాల్లోకి ధనుష్?.. బహిరంగ సభతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
-
Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
-
Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
ట్రెండింగ్
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!