భారత్‌లో సెకండ్‌వేవ్‌లో అత్యధిక కేసులు, మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలో 85 దేశాల్లో వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పేర్కొన్నది. సార్స్‌కోవ్ 2 వైరస్‌లో వివిధ వేరియంట్లు ఉన్నా అందులో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్‌లుగా విభజించింది. ఆల్ఫా వేరియంట్ 170 దేశాల్లో వ్యాప్తి చెందగా, బీటా వేరియంట్ 119 దేశాల్లో వ్యాప్తి చెందింది. గామా వేరియంట్ 71 దేశాల్లో వ్యాప్తి చెందగా, డెల్టావేరియంట్ మాత్రం 85 దేశాల్లో వ్యాప్తి చెందినట్లు తెలిపింది.
Read: మూడో వెబ్ సీరిస్ కు మిల్కీబ్యూటీ గ్రీన్ సిగ్నల్!
అయితే, ఈ వేరియంట్లలో డెల్టా వేరియంట్ ప్రమాదకారిగా మారిందని, ఈ వేరియంట్ తో భౌగోళిక ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ఈ డెల్టా వేరియంట్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయని, ఆల్ఫాకంటే డెల్టా వేరియంట్ తోనే ముప్పు అధికమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. డెల్టా కేసులు ఎక్కువగా నమదైన ప్రాంతాల్లో ఆసుపత్రులపై ఒత్తిడి, ఆక్సిజన్ వినియోగం, మరణాల సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.