కరోనా వైరస్.. రెండేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల్లో ప్రాణాలను బలి తీసుకున్న ఈ వైరస్ కొత్త రూపం దాల్చి మళ్లీ విజృంభించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఓమిక్రాన్ వెరియంట్ ఉత్పవరివరతనమైన బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో కోవిడ్ 19 బ్రిటన్‌లో వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని ప్రభావం భారత్‌పై కూడా పడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కొత్త వెరియంట్ వల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉండకపోవచ్చు కానీ.. ఈ వ్యాధి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కాల్చి చంపాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
కోవిడ్-19 సోకిన వారిలో రుచి రుచి, వాసన కోల్పోవడం ప్రధాన లక్షణం. అయితే ఈ కొత్త వెరియంట్ బీఏ 2.86 లేదా పిరోలా సోకిన వారిలో అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్క కారటం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం ముందుగా ముఖంపై పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దుద్దుర్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో ఓమిక్రాన్ వెరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.
Also Read: Alia Bhatt: రణ్‌బీర్ ఆలియాను వేధిస్తున్నాడా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
దీంతో ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకే ప్రభుత్వం ముమ్మరం చేసింది. ముఖ్యంగా వృద్దులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై యూకే హెల్త్ సెక్యూరిటీ దృష్టి పెట్టింది. కరోనా టీకా, బూస్టర్ డోస్ తీసుకోని వారు వెంటనే ఈ తీసకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడకుండ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, రద్ది ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనూ మాస్క్ ధరించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ బీఏ 2.86 కేసులు గత జూలైలో కనిపించాయి.