JN.1 Cases: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. ఇదిలా ఉంటే కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసుల్లో పెరుగుదల కూడా కలవరపరుస్తోంది. ఇన్సాకాగ్(INSACOG) డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 263 JN.1 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కేరళలోనే నమోదయ్యాయి.
కొవిడ్ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో సమీక్షించారు. జేఎన్–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు.
కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నందున కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి.కృష్ణబాబు వెల్లడించారు. కొవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన మీడియాతో చెప్పారు.
కరోనా వైరస్.. రెండేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల్లో ప్రాణాలను బలి తీసుకున్న ఈ వైరస్ కొత్త రూపం దాల్చి మళ్లీ విజృంభించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఓమిక్రాన్ వెరియంట్ ఉత్పవరివరతనమైన బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో కోవిడ్ 19 బ్రిటన్‌లో వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని ప్రభావం భారత్‌పై కూడా పడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కొత్త వెరియంట్ వల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉండకపోవచ్చు కానీ.. ఈ వ్యాధి లక్షణాలతో ప్రజలు…
కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది.. ఇప్పట్లో థర్డ్ వేవ్ ముప్పుకూడా పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వేశారు.. కానీ, కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు వెలుగుచూస్తున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. అప్రమత్తమైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, సింగపూర్లు సదరన్ఆఫ్రికా దేశాలపై ట్రావెల్బ్యాన్విధించాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం…