Ponniyan Selvan: పగతో రగులుతున్న ఐశ్వర్యరాయ్.. ఎవరిపైనంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందమైన ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం.. పళువూరు రాజ్యానికి రాణి.. అయినా ఆమె ముఖంలో సంతోషం లేదు.. ఎవరిపైనో పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లు కసిగా చూస్తోంది. ఆ అందమైన రూపం వెనుక క్రూరమైన ఆలోచనలు ఉన్నాయా..? అంతగా ఆ రాణిని హింసించింది ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1 చూడాల్సిందే. కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కుతునన్ విషయం విదితమే.. 1955 లో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం.. భారీ తారాగణం అంతకు మించి భారీ వ్యయంతో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. విక్రమ్, కార్తీ, జయం రవి, నాజర్, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ్ల వంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన విక్రమ్, కార్తీ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమాలోని ఐశ్వర్య రాయ్ బచ్చన్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపిస్తోంది. అందులో ఒకటి నందిని.. పళువూరు రాణి. ‘ప్రతీకారానికి అందమైన ముఖం..ఇదుగో పళువూరు రాణి నందిని’ అంటూ మేకర్స్ ఐశ్వర్య రాయ్ ను పరిచయం చేసారు. రాణి నందిని గా ఐశ్వర్య లుక్ అదిరిపోయింది. నిజంగా ఆ కాలంలో రాణులు ఇంత అందంగా ఉండేవారా..? అనేంతగా ఐష్ లుక్ మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.. మరి ఈ సినిమాతో తెలుగులో ఐష్ ఘనవిజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!