NTV Telugu Site icon

Iran-Israel: ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రతిదాడికి సిద్ధం కావాలి: ఇరాన్‌ సుప్రీంలీడర్

Ali Khameni

Ali Khameni

Iran-Israel : ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడులకు ప్రతి దాడి చేస్తామని టెహ్రాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ప్రతి దాడికి సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీఖమేని తన దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులోభాగంగా టెహ్రాన్‌ దళాలు టెల్‌అవీవ్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు కథనంలో ప్రచురించింది. మరోవైపు ఇరాక్‌ భూభాగం నుంచి ఇరాన్‌ తన అనుకూల మిలిటెంట్ల ద్వారా దాడి చేస్తుందని ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు వెల్లడించాయి.

Read Also: Aghori news: తెలంగాణలో హాట్ టాపిక్ గా అఘోరీ ఇష్యూ.. పోలీసుల అదుపులో నాగసాధు

ఇక, ఐడీఎఫ్‌, భద్రతా సేవలకు నేను నిర్దేశించిన అత్యున్నత లక్ష్యం ఇరాన్‌ అణ్వాయుధాలను సాధించకుండా నిరోధించడమే అని ఇజ్రాయెల్ తెలిపింది. దీంతో టెహ్రాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఇరాన్‌ నాయకుల అహంకారపు మాటలు నేడు అక్కడి వాస్తవాన్ని కప్పిపుచ్చలేవు అని చెప్పుకొచ్చారు. మునపటికంటే మాకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది.. మేము వారి భూభాగంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read Also: Hyderabad Crime: చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ .. నిందితుడు డాక్టర్ కాదా..?

కాగా, అక్టోబరు 1వ తేదీన టెల్‌అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్‌ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌కు చెందిన నలుగురు సైనికులు చనిపోగా.. క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయొద్దని పలు దేశాలు ఇరాన్‌కు సూచనలు చేశాయి. మరోవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్‌పై ప్రతికార దాడి చేసేందుకు ఇరాన్ సన్నాహాలు చేస్తుందని సమాచారం.