మళ్లీ పంజా విసురుతోన్న కోవిడ్.. ఒకేరోజు 10 వేల మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ వచ్చినట్టే వచ్చి.. మళ్లీ పంజా విసురుతున్నాయి… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందనే హెచ్చరికలు ఓవైపు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ కేసులు పెరగడం.. మృతుల సంఖ్య కూడా క్రమంగా పైకి కదులుతుండడంతో మళ్లీ కలవరం మొదలైంది.. తాజా గణాకాంల ప్రకారం.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఇదే సమయంలో 10 వేల మందికి పైగా కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు..
అయితే, కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గినా.. అమెరికా, బ్రిటన్, ఇరాన్ తదితర దేశాల్లో వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగా ఉంది.. గత 24 గంటల్లో అమెరికాలోనే 1.16 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 614 మంది మృతిచెందారు. ఇరాన్లో 39 వేలకు పైగా కేసులు, 568 మరణాలు సంభవించాయి.. బ్రిటన్‌లోనూ కొత్తగా 33 వేల కోవిడ్ కేసులు బయటపడ్డాయి. జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,54,62,557 మంది కోవిడ్ బారినపడగా.. 43,35,111 మంది ప్రాణాలు వదిలారు.. ఇక,కోవిడ్‌బారినపడి ఇప్పటి వరకు 18.5 కోట్ల మందికి పైగా పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మొత్తంగా మళ్లీ పాజిటివ్ కేసులు, మరణాలు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ నడుస్తున్నా.. మరోవైపు కోవిడ్ కలవరానికి గురిచేస్తోంది..
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!