Corona Virus: బీ అలర్ట్.. బీఎఫ్-7 వేరియంట్ రూపంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Virus: ఒమిక్రాన్ వేరియంట్‌తో ముగిసిపోయిందని భావించిన కరోనా కొత్త రూపు సంతరించుకుంది. బీఎఫ్-7 అనే వేరియంట్‌తో మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తొలుత చైనాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం వంటి దేశాలకు వ్యాపిస్తోంది. దీని వ్యాప్తిని నిరోధించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్ వేరియంట్‌గా మారుతుందని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్ పత్రిక హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: Diwali Date: 24నా..? 25వ తేదీనా? దీపావళి పండుగపై అయోమయం
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
బీఎఫ్-7 కరోనా సబ్ వేరియంట్‌ను మన దేశంలో కూడా గుర్తించారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసర్చ్ సెంటర్ ఈ వేరియంట్‌ను గుర్తించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీని వ్యాప్తిని నిరోధించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇప్పటికే చైనాలో బీఎఫ్-7 కేసులు పెరుగుతుండటంతో పలు చోట్ల లాక్‌డౌన్ విధిస్తున్నారు. కాగా ఈ వేరియంట్‌కు సంబంధించి వచ్చే రెండు మూడు వారాలు కీలకమని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా అభిప్రాయపడ్డారు. కరోనా ఇంకా పూర్తిగా అంతరించలేదని.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొత్త వేరియంట్‌లు బయటపడుతున్నాయని.. వాటి నుంచి ప్రజలు క్షేమంగా ఉండలేరని తెలిపారు. మున్ముందు ముఖ్యమైన పండగలు ఉన్నందున కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని అరోరా సూచించారు. అటు బీఏ 5.1.7 అనే సబ్ వేరియంట్‌ను కూడా చైనాలో గుర్తించారు.
- Tags
- bf 7
- china
- corona virus
- Covid 19
- india
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!