Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Condom Prices Hike 30 Percent Usa Iran Tension Karex Supply Crisis

Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కాండమ్ ధరలకు రెక్కలు!

Published Date :April 22, 2026 , 7:34 pm
By Shiva Ganesh
Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ!  కాండమ్ ధరలకు రెక్కలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Condom Prices: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా వినియోగ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉధృతి కారణంగా, ప్రపంచవ్యాప్తంగా కాండమ్ ధరలు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరగనున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనున్నాయి. యుద్ధ భయాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కాండమ్ తయారీ సంస్థ ‘కారెక్స్’ (Karex) ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం కేవలం ఒక వస్తువుకే పరిమితం కాకుండా, విమాన ప్రయాణాలు, నిత్యావసరాలపై కూడా పడనుంది.

ధరల పెరుగుదలకు కారణాలేంటంటే..
కారెక్స్ సీఈఓ గో మియా కియాట్ (Goh Miah Kiat) వెల్లడించిన వివరాల ప్రకారం.. కాండమ్‌ల తయారీకి అవసరమైన అమ్మోనియా, సిలికాన్ ఆధారిత లూబ్రికెంట్లు వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌లో ఐదో వంతు హోర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. అక్కడ సైనిక ఆంక్షలు, నాకేబందీ కారణంగా రవాణా వ్యయం భారీగా పెరిగింది. విచిత్రంగా యుద్ధం లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో కాండమ్స్‌కు డిమాండ్ 30% పెరిగింది. ఉద్యోగ భద్రత లేనప్పుడు ప్రజలు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే డిమాండ్ పెరిగిందని సంస్థ తెలిపింది. కారెక్స్ సంస్థ ఏటా 500 కోట్లకు పైగా కాండమ్స్‌ను తయారు చేస్తూ డ్యూరెక్స్ (Durex), ట్రోజన్ (Trojan) వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేస్తోంది.

Also Read

  • RBI: ఆర్‌బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
  • Nestle India: నెస్ట్లే ఇండియా 'లాభాల' మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?
  • Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..

ఇతర రంగాలపై ప్రభావం..
హోర్ముజ్ ఉద్రిక్తతల వల్ల కేవలం కాండమ్స్ మాత్రమే కాదు, మరికొన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి. అవి ఏంటంటే.. గత ఏడాదితో పోలిస్తే ఎకానమీ క్లాస్ విమాన టికెట్ల ధరలు సగటున 24% పెరిగాయి. ఇదే సమయంలో రవాణా ఖర్చులు పెరగడంతో చక్కెర, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల ధరలు కూడా పెరగనున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. హీలియం గ్యాస్ కొరత కారణంగా కంప్యూటర్ చిప్స్ తయారీ మందగించి, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Condom price hike 2026
  • Durex and Trojan supply news
  • Flight Ticket Price Hike
  • Global supply chain issues 2026
  • Karex condom price increase

తాజావార్తలు

  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కాండమ్ ధరలకు రెక్కలు!

  • IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..

  • Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..

  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions