H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు H-1B వీసా విధానంపై అనేక కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాడు. H-1B వీసాల ద్వారా విదేశీయులు, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. H-1B వీసాలపై అమెరికా ఏ కఠిన నిర్ణయం తీసుకున్నా, ఇది భారతీయులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వీసాల కింద అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 70 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు.
Read Also: Delhi Car Blast: మహిళా ఉగ్ర డాక్టర్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ భార్యతో సంబంధం..
అయితే, డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై కొత్త విధానానికి రెడీ అవుతున్నాడు. విదేశీ వర్కర్లపై ఎక్కువగా ఆధారపడకుండా, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం అమెరికన్లకు శిక్షణ ఇవ్వడానికి విదేశీ నిపుణుల్ని కొంత కాలం పాటు అమెరికాలోకి అనుమతించేందుకు సిద్ధమైనట్లు ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు. అమెరికాలో కొన్ని రంగాల్లో విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. దీని ప్రకారం, కొత్త H-1B వీసా విధానంలో విదేశీ నిపుణులు ముందుగా అమెరికాకు వచ్చి, అక్కడి స్థానికులకు శిక్షణ ఇచ్చి, మళ్లీ తిరిగి సొంతదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి మూడు, ఐదు లేదా ఏడు ఏళ్లు నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల్ని అమెరికాలోకి అనుమతించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది.
